AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా.. పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రివాల్ సర్కార్

దేశంలో కరోనా కేసులు(Corona Cases) తగ్గుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

Corona: దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా.. పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రివాల్ సర్కార్
Delhi Compressed
Ganesh Mudavath
|

Updated on: Apr 15, 2022 | 1:53 PM

Share

దేశంలో కరోనా కేసులు(Corona Cases) తగ్గుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఏ ఒక్కరికీ కరోనా సోకినా పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది మాస్కులు, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో గురువారం 325 మందికి కరోనా సోకింది. సోమవారం నాటి కేసులతో పోలిస్తే 237% పెరుగుదల కనిపించింది. ఒక్క వారంలో పాజిటివిటీ రేటు 0.5% నుంచి 2.39%కి పెరిగడం ఆందోళన కలిగిస్తోంది. వసంత్‌కుంజ్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8 మంది పిల్లలు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా స్కూల్ లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ 23 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ ను మూసివేశారు. ఘజియాబాద్‌లోని స్కూల్ లో కూడా ఇద్దరు విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ కు 3 రోజుల సెలవులు ప్రకటించారు.భారత్‌లో కొత్త వేరియంట్‌ ఎంట్రీ కలకలం రేపుతోంది. కరోనా

ముప్పు తగ్గలేదు..జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు అధికారులు. మరోవైపు కరోనా ముప్పు తగ్గలేదని.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని WHO పదే పదే హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్‌ ఎంట్రీ అయ్యిందన్న విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్‌ కేసులు ముంబైలో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ సైతం కోవిడ్‌ ముప్పు ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదని, జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యే హెచ్చరించారు.

Also Read

CBSE కీలక నిర్ణయం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మోడ్ పరీక్షలు..!

Realme Ac: ‘రియల్‌మి’ ఏసీలు వచ్చేశాయ్‌.. సరసమైన ధరలో.. అందరికి అందుబాటులో..!

Indian Railways: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేసి ఇబ్బందుల్లో పడకండి..!

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్