Munugode-Bypoll: మునుగోడు పోలింగ్‌లో ఓట్లు చీలుతాయా..? ఎవరికి మేలు జరుగుతుంది..?
తెలంగాణలో రాజకీయా పరిణామాలు మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. నువ్వా..

తెలంగాణలో రాజకీయా పరిణామాలు మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. టీఆర్‌ఎస్ పార్టీకి ఇతర పార్టీలతో సవాల్‌గా మారింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బగలడంతో ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. అయితే మునుగోడు బరిలో ఎక్కువగా మంది ఉండటంతో, అందులో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉండటంతో ఓటర్ల ప్రభావం ఎవరిపైనా పడుతుందనే చర్చ సాగుతోంది. వారు ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది..? ఎవరికి లాభం చేకూరుతుందనే అంశాలు అంచనా వేస్తున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు క్రాస్ ఓటింగ్ కూడా భయపెడుతోంది. అందుకే ప్రధాన పార్టీల ఓట్లు చీలిపోకుండా ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తున్నాయి పలు పార్టీలు. గతంలో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పడ్డాయి…? ఈ మేరకు పడ్డాయోనని చర్చలు జరుపుతున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఈ మునుగోడు ఉప ఎన్నిక బరిలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు జాతీయ పార్టీలైన బీఎస్పీ నుంచి ఒకరితో పాటు నలుగురు ఉండగా, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 10 మంది వరకు ఉన్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ ముందు 83 మంది బదిలీలో ఉన్నా.. ప్రధాన పార్టీలు 36 మంది స్వతంత్రులను ఒప్పించి బదిలో నుంచి తప్పించారు. మొత్తంగా ప్రధాన పారీటలు మినహా మిగతా 44 మంది అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చుతారన్నది ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలెఓ కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి