Minister KTR: ‘గీత కార్మికులకు అండగా నిలుస్తాం.. త్వరలోనే మోపెడ్ లు అందిస్తాం’.. మంత్రి కేటీఆర్..
ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్ని రకాల సామాజిక వర్గాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పట్లో కులవృత్తులు ధ్వంసం..
ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్ని రకాల సామాజిక వర్గాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పట్లో కులవృత్తులు ధ్వంసం అయితే.. ప్రస్తుతం బలోపేతం అవుతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్న కేటీఆర్.. వైన్ షాపుల్లో వారికి 15 శాతం రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. చెట్ల పన్ను రద్దు చేశామని, కల్లు డిపోలను తెరిపించి గౌడన్నలకు అండగా నిలిచామన్నారు. పెన్షన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచామని వివరించారు. గీత కార్మికులకు కూడా నెల రూ.2016 పెన్షన్ ఇస్తున్నామని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని అన్నారు. గీత వృత్తిదారులకు మోపెడ్‌లు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు ఉండేవి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరెంట్ సమస్య పరిష్కారమైంది. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. ప్రాజెక్టులు, ఉచిత కరెంటుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగు నీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది.
– కేటీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి
రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కు ఎక్కవ ఇంపార్టెంట్ ఇస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 975 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, ఆడపిల్లలను ఉన్నత విద్యావంతులను చేస్తున్నామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని, నర్సరీ, ట్రాక్టర్, నీళ్లు, కరెంటు ఏర్పాటు చేశామని వివరించారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..