Telangana: ఎస్సై, కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై తుది రాత పరీక్ష ఫలితాలను TSLPRB విడుదల చేసింది. సివిల్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.  ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్  పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు. సివిల్ ఎస్ఐ పోస్టులకు 43,708 మంది ఎంపికయ్యారు.

Telangana: ఎస్సై, కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
Ts Police
Follow us

|

Updated on: May 30, 2023 | 6:29 PM

తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై తుది రాత పరీక్ష ఫలితాలను TSLPRB విడుదల చేసింది. సివిల్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.  ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్  పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు. సివిల్ ఎస్ఐ పోస్టులకు 43,708 మంది ఎంపికయ్యారు. ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది అర్హత సాధించారు.

అలాగే ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేర్కొంది. ఈరోజు రాత్రి నుంచి అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు వెబ్‌సైట్ లో పెడతామని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఫైనల్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌ సైట్‌ లో తమ వ్యక్తిగత లాగిన్ లో చూసుకోవచ్చని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..