AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Meeting: కేంద్రంపై టీఆర్ఎస్ సమరమే.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ యాక్షన్ ఫ్లాన్..!

కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక్ష పోరుకు యాక్షన్ ఫ్లాన్ సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆందోళనకు సిద్దమవుతోంది.

TRS Meeting:  కేంద్రంపై టీఆర్ఎస్ సమరమే.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ యాక్షన్ ఫ్లాన్..!
Kcr
Balaraju Goud
|

Updated on: Mar 19, 2022 | 5:22 PM

Share

TRS General Body Meeting: కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక్ష పోరుకు యాక్షన్ ఫ్లాన్ సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆందోళనకు సిద్దమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినున్నట్లు సీఎం కేసీఆర్ ప్రక‌టించారు. ఈ స‌మావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌భ్యులు, జిల్లా అధ్యక్షుడు, జ‌డ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు స‌మితుల జిల్లా అధ్యక్షులు త‌ప్పనిస‌రిగా హాజ‌రు కావాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం క‌చ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.

Read Also….  CM KCR Meeting: ఎర్రవల్లి ఫాంహౌజ్ వేదికగా మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర మంతనాలు..!