AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Rains: రాష్ట్రాన్ని ముందే పలకరించిన రుతుపవనాలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వరంగల్ లోతట్టు ప్రాంతాలు జలమయం

తెలంగాణలో వాతావరణ మారిపోయింది. రాష్ట్రంలో రుతుపవనాలు ఇప్పటి వరకు మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే ప్రవేశించాయి.

Telangana Rains: రాష్ట్రాన్ని ముందే పలకరించిన రుతుపవనాలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వరంగల్ లోతట్టు ప్రాంతాలు జలమయం
Telangana Rains
Balaraju Goud
|

Updated on: Jun 09, 2021 | 10:34 AM

Share

Telangana Southwest Monsoons Rains: తెలంగాణలో వాతావరణ మారిపోయింది. రాష్ట్రంలో రుతుపవనాలు ఇప్పటి వరకు మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే ప్రవేశించాయి. వచ్చే మూడు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నిజామాబాద్‌.. కరీంనగర్‌, మేడ్చల్‌, సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో పలు చోట్ల ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని బుధవారం తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. కరీంనగర్, హుజురాబాద్, జమ్మికుంట, వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వరంగల్‌తో పాటు హన్మకొండ, ఖాజీపేట, మణికొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట మండలాల్లో జోరుగా వానపడుతోంది. వర్షం కారణంగా వరంగల్ నగరంలో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని రహదారులు చెరువులా మారాయి. బస్టాండ్ ఆవరణలో బారీగా నీరు నిలిచింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నైరుతి రుతుపవనాలు రెండు రోజులుగా మందగించాయి. కేరళ తీరం నుంచి ముందుకు కదిలిన రుతుపవనాలు ఈనెల 6వరకు చురుగ్గా ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమగాలులు బలంగా లేకపోవడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనే విస్తరించాయి. అయితే, ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున రుతుపవనాలు వేగం పుంజుకోవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read Also….  Guntur Young Man beaten death: ప్రాణం తీసిన సెల్‌ఫోన్.. కాల్ చేసుకుంటానంటే ఇచ్చిన పాపానికి యువకుడు బలి!