AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharmila : జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుపై నేడు సన్నాహాక సమావేశం.. అన్ని స్థాయిల్లో అడహక్ కమిటీలు ప్రకటించనున్న షర్మిల

పార్టీ ప్రకటన తేదీ దగ్గర పడుతుండటంతో వైయస్ షర్మిల ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌ పాండ్‌ ఆఫీస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక..

Sharmila : జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుపై నేడు సన్నాహాక సమావేశం.. అన్ని స్థాయిల్లో అడహక్ కమిటీలు ప్రకటించనున్న షర్మిల
Y S Sharmila
Venkata Narayana
|

Updated on: Jun 09, 2021 | 9:59 AM

Share

YS Sharmila : కొత్తపార్టీ ప్రకటన తేదీ దగ్గర పడుతుండటంతో వైయస్ షర్మిల ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌ పాండ్‌ ఆఫీస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ కాబోతున్నారు. జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల ఈ సన్నాహాక సమావేశంలో చర్చిస్తారు. పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడహక్ కమిటీలను కూడా షర్మిల ఇవాళే ప్రకటించనున్నారు. కాగా, షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు “వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)”గా నిన్ననే ఆపార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు సమన్వయకర్త రాజగోపాల్ ప్రకటించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న వైఎస్​ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు రాజగోపాల్ వెల్లడించారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రాజగోపాల్ స్పష్టం చేశారు. ఇలాఉండగా, తెలంగాణ పాలిటిక్స్‌లో అరంగేట్రం షురూ చేసిన వైయస్ షర్మిల రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా షర్మిల వాడి వేడి విమర్శల బాణాలు సైతం వదులుతున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రైతుల వెతలు తదితర అంశాల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు షర్మిల. ‘వైయస్ఆర్ తెలంగాణ పార్టీ’కి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను సైతం ఇప్పటికే నియమించారు షర్మిల. వీరిలో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు. ఇవాళ గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడ్ హక్ కమిటీలు కూడా ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల.

Read also : Junior doctors : నేటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె .. రేపు కొవిడ్‌ విధులు, 12న అత్యవసర విధుల బహిష్కరణ నిర్ణయం

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..