Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. రానున్న మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Hyderabad Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో...
Hyderabad Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో రాబోయే 3 రోజుల్లో అంటే రేపు 12, 13 మరియు 14 వ తేదీలలో హైదరాబాద్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అంతేకాదు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో జీహెచ్ ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. అత్యవసర సహాయార్ధం అన్ని శాఖల అధికారులను, మాన్‌సూన్ అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు.
మరోవైపు తెలంగాణ మీదుగా పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయిలో బలమైన గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(30 నుంచి 40 కిలోమీటర్ల వేగం)తో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 12, 13 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం జీవనం కోసం కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్