AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: తెలంగాణలో ఇదో సరికొత్త ‘పవర్‌’ వార్‌.. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కేటీఆర్ మార్క్ వ్యూహం..!

Minister KTR: తెలంగాణ రాజకీయాల్లో కరెంట్ వార్ మరింత హీటెక్కిస్తోంది.. పవర్‌తో పవర్‌లోకి రావాలని కాంగ్రెస్‌.. అదే పవర్‌ మంటలతో కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ఇటు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌.. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ దూసుకెళ్తున్నాయి..

Telangana Politics: తెలంగాణలో ఇదో సరికొత్త ‘పవర్‌’ వార్‌.. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కేటీఆర్ మార్క్ వ్యూహం..!
Telangana Politics
Sridhar Prasad
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 15, 2023 | 5:29 PM

Share

Minister KTR: తెలంగాణ రాజకీయాల్లో కరెంట్ వార్ మరింత హీటెక్కిస్తోంది.. పవర్‌తో పవర్‌లోకి రావాలని కాంగ్రెస్‌.. అదే పవర్‌ మంటలతో కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ఇటు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌.. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ దూసుకెళ్తున్నాయి.. ఈ క్రమంలో.. మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్‌ రద్దవుతుందంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి.. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు పిలుపు ఇచ్చారు. ఇదే విషయంపై బిఅర్ఎస్ పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరించాలని.. నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ నెల17 నుంచి పది రోజులపాటు రైతు సమావేశాలు జరిపి కాంగ్రెస్ కరెంటు కుట్రలపై ప్రతి గ్రామంలో చర్చ జరపాలన్నారు. ప్రతి రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు పెట్టి మూడు పంటలు టీఆర్ఎస్ నినాదం – మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం పేరిట ఈ సమావేశాల్లో చర్చించాలని బిఅర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ ఆదేశాలిచ్చారు. ఎకరానికి గంట విద్యుత్‌చాలన్న కాంగ్రెస్ నేతల మాటలు రైతులను అవమానించడమేనని.. రైతులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చెయ్యాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

24 గంటల ఉచిత విద్యుత్తు వద్దన్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ కుట్రను రైతాంగానికి వివరించాలని.. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? కరెంట్ వెలుగుల బిఆర్ఎస్ కావాలా..? తెలంగాణ రైతులు తెల్చుకోనేలా అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అయితే, రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఇటీవల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్.. ఇప్పుడు రైతు సమావేశాలు నిర్వహించేలా కొత్త కార్యాచరణ ప్రారంభించడం.. కరెంట్ వార్ ఇప్పుటితో ముగిసేలా లేదని.. మున్ముందు మరింత రాజుకునే అవకాశం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..