AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి చీర గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఏంటంటే.?

అతివలు, మగువలు, విదేశీ వనితలు మెచ్చిన చీరలు పోచంపల్లి చీరలు. ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన పోచంపల్లి చీరలు ఎందరో విదేశీ వనితలను ముగ్ధులను చేస్తున్నాయి.

M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 18, 2023 | 12:30 PM

Share
అతివలు, మగువలు, విదేశీ వనితలు మెచ్చిన చీరలు పోచంపల్లి చీరలు. ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన పోచంపల్లి చీరలు ఎందరో విదేశీ వనితలను ముగ్ధులను చేస్తున్నాయి. తాజాగా ఫ్యాన్స్ అధ్యక్షుడు సతీమణి బ్రీగెట్టేకు.. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పోచంపల్లి చీరను చందనం పెట్టెలో బహూకరించారు. ఆ చేనేత పోచంపల్లి చీర విశేషాలను తెలుసుకోవాలంటే...

1 / 6
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచి పట్టుచీరలకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నిలయంగా మారింది. పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక.. ఇక్కడి కంచి పట్టుచీరలు. నాణ్యమైన పట్టు వార్పు డిజైన్ పట్టుచీర పోచంపల్లిలో చేనేత మగ్గంపై తయారు చేశారు. ఇక్కడ చేనేత కార్మికులు నేసిన పోచంపల్లి చీరలను నిలువు ఇక్కత్ చీరలు అని కూడా అంటారు.

2 / 6
ఇక్కత్ చీర పోచంపల్లిలో తయారైన అద్భుత కళారూపం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణి బ్రిగెట్టేకు బహుమానంగా ఇచ్చిన పోచంపల్లి చేనేత చీరను ఇక్కడి కళాకారులు ప్రత్యేకతలతో తయారు చేశారు.

3 / 6
ఈ పోచంపల్లి చీర 46 ఇంచుల వెడల్పుతో 5.5 మీటర్ల పొడవుతో ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించి అత్యంత సంక్లిష్టమైన డిజైన్‌లతో ఈ చీరను చేనేత కళాకారులు తయారు చేశారు. ఇక్కత్ టై అండ్ డై ట్రెడిషనల్ డిజైన్లతో చీరని నేసారు. ఇద్దరు చేనేత కార్మికులు 10 రోజుల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేశారు.

4 / 6
ఇప్పటికే ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన పోచంపల్లి పట్టుచీరలు.. విదేశీ వనితలను ఆకట్టుకూన్నాయి. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల సతీమణులకు పోచంపల్లి చీరలను మన దేశాధినేతలు బహుకరించారు. జాతీయస్థాయిలో ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ప్రముఖులైన కళాకారులను పోచంపల్లి పట్టు చీరలు ఆకర్షించాయి.

5 / 6
ఇండియాలో పర్యటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రాంప్ కూతురు ఇవాంకకు కూడా పోచంపల్లి చీరను బహుకరించారు. తమ చేతుల్లో తయారైన ఈ పట్టుచీరను ప్రధానమంత్రి మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణి బ్రిగెట్టేకు బహుమానంగా ఇవ్వడంతో చేనేత కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

6 / 6
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!