- Telugu News Photo Gallery Cinema photos Kamal Hassan In Jr NTRs Next Movie Vijay Sethupathi New Project Announced
తారక్ సినిమాలో లోకనాయకుడు.? ‘ప్రేమలో నిజాయతీ..’ అంటున్న విజయ్ దేవరకొండ
కమల్‌హాసన్ మరో ప్యాన్ ఇండియా సినిమాకు సైన్ చేశారనే వార్తలు జోరందుకున్నాయి. ఆల్రెడీ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కెకి సైన్ చేశారు లోకనాయకుడు. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా పనిచేస్తారనే వార్త వైరల్ అవుతోంది.
Updated on: Jul 18, 2023 | 3:37 PM

కమల్‌హాసన్ మరో ప్యాన్ ఇండియా సినిమాకు సైన్ చేశారనే వార్తలు జోరందుకున్నాయి. ఆల్రెడీ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కెకి సైన్ చేశారు లోకనాయకుడు. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా పనిచేస్తారనే వార్త వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో మెయిన్ విలన్‌గా కమల్ కనిపిస్తారని కోలీవుడ్ టాక్.

బేబీ సినిమా టీమ్‌ని ప్రశంసించారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రీమియర్ షోకి హాజరయ్యారు ఆయన. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా బేబీ జూలై 14 విడుదలైంది. ప్రేమలో నిజాయతీ ఉండటమే తన దృష్టిలో మాస్ అని, అది బేబీ మూవీలో చాలా ఉందని అన్నారు హీరో ఆనంద్ దేవరకొండ కొండ. విజయ్‌తో పాటు రాశీఖన్నా కూడా ప్రీమియర్ షోకి అటెండ్ అయ్యారు.

విజయేంద్ర వర్మ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానని అన్నారు నాయిక అంకిత. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే, ఇండస్ట్రీలో ఉండేదాన్ని అని అన్నారు. ఆ సినిమా ఆడలేదని చెప్పారు. అందుకే కెరీర్‌ని వదిలిపెట్టినట్టు తెలిపారు. ముంబయ్‌కి చెందిన వ్యాపారవేత్త విశాల్ జగపతితో 2016లో పెళ్లయింది అంకితకు. ఈ దంపతులు న్యూజెర్సీలో స్థిరపడ్డారు.

విజయ్ సేతుపతి నటిస్తున్న 50వ సినిమా మహారాజా. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్ కీ రోల్స్ లో నటించారు. ఆల్రెడీ షూటింగ్ మొత్తం పూర్తయింది. విజయ్ సేతుపతి కెరీర్‌లో ఇది చాలా స్పెషల్ మూవీ అని అంటున్నారు మేకర్స్. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మైల్‌స్టోన్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయన్నారు సేతుపతి.

మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హృదయమ్ కాంబినేషన్ రిపీట్ కానుంది. వర్షంగళ్తు శేషం మూవీలో ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించనున్నారు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వినీత్ శ్రీనివాసన్ డైరక్ట్ చేస్తారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది.




