సీఎం రేవంత్ రెడ్డి 50సార్లు ఢిల్లీ వెళ్లారు.. తెలంగాణ పాలిటిక్స్‌లో దుమ్ముదుమారం.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్..
సీఎం రేవంత్ ఢిల్లీ టూర్లు తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. 50సార్లు ఢిల్లీ వెళ్లినా పైసా యూజ్ లేదని బీఆర్ఎస్ అంటుంటే.. ఢిల్లీ వెళ్లడం వల్లే బనకచర్లకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. అటు.. సీఎం రేవంత్ టార్గెట్‌గా కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టడం మరింత హీట్ పెంచుతోంది.

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎక్స్‌లో ఒకటి నుంచి 50 వరకు అంకెలు వేసి.. ఇవి కేవలం సంఖ్యలు కావు సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ల వివరాలు అని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటనల్లో రేవంత్‌రెడ్డి అర్ధశతకం సాధించారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలతో తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరుతుందని ప్రశ్నించారు. 20 నెలల పదవీకాలంలో రేవంత్‌రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లారని.. తెలంగాణకు మాత్రం సాధించిందేమీ లేదన్నారు. తెలంగాణకు పాలించే ముఖ్యమంత్రి కావాలి.. కానీ.. ఢిల్లీ యాత్రలు చేసే టూరిస్టు సీఎం కాదని కేటీఆర్ విమర్శించారు. కేటీఆర్ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచుతోంది.
ఇక.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లపై కేటీఆర్ కామెంట్స్‌కి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
20 నెలల రేవంత్‌రెడ్డి పాలనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి. ఢిల్లీ టూర్లలో ఉన్న జోష్.. ఆరు గ్యారెంటీల అమలులో ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించారు.
మరోవైపు… తెలంగాణ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేంద్రాన్ని నిలదీస్తూ నిధులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
మొత్తంగా… సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలు తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నాయి. రేవంత్ ఢిల్లీ టూర్లతో తెలంగాణకు జరిగే లాభం ఏం లేదని బీఆర్ఎస్ అంటుంటే.. ఆయన టూర్‌తోనే బనకచర్లకు బ్రేకులు పడ్డాయంటోంది కాంగ్రెస్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
