Telangana Politics: తగ్గేదేలే.. బీఆర్ఎస్ vs బీజేపీ మధ్యలో కాంగ్రెస్.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఫిర్యాదుల పరంపర
తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు ప్రత్యర్థి పార్టీల నేతలపై వరుస ఫిర్యాదులు చేస్తుండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు..

తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు ప్రత్యర్థి పార్టీల నేతలపై వరుస ఫిర్యాదులు చేస్తుండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.. తప్పుడు పోస్టులతో ప్రజలను బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారి పోస్టులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది బీజేపీ. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వివాదం తీవ్రమైంది.
ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు.. కేసీఆర్‌పై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారని ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ స్థాయి మరచి అసత్య ఆరోణలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
దొంగ నోట్ల ప్రెస్‌పై గతంలోనూ కేసీఆర్‌పై ఆరోపణలున్నాయని తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలను మరోసారి సమర్థించారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు..
అంతకుముందు కేసీఆర్ పై గవర్నర్‌కు గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు .. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిర్యాదులతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.. మొత్తానికి పార్టీల ఫిర్యాదుల పరంపరకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..