Telangana: కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఆ జిల్లా హస్తం నేతలు
తీవ్ర ఆగ్రహానికి గురైన వీహెచ్ ఒకనొక దశలో సభను బైకాట్ చేసి బయటకు వెళ్లగా బీసీ నేతల విజ్ఞప్తితో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగించారు. బీసీ ఐక్య వేదికనుఅడ్డుకుని బీసీల అగౌరవపరిచారని.. వీహెచ్ పైకి దాడికి యత్నించాడని డీసీసీ అద్యక్షుడు సాజుద్ ఖాన్ కంది శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బీసీ ఐక్య వేదిక సభ రసాభాసగా మారింది. జిల్లా కాంగ్రెస్ నేతలు సాజిద్ ఖాన్, కంది శ్రీనివాస్ రెడ్డి వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత...
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. డీసీసీ అద్యక్షుడు సాజిద్ ఖాన్ వర్గం , కంది శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ ఐక్య వేదిక కార్యక్రమానికి తనను అనుమతించక పోవడంతో కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం పంక్షన్ హాల్లోకి చొచ్చుకెళ్లింది. డీసీసీ వర్గం గేట్లు మూసి కందిని అడ్డుకోవడంతో రచ్చకు దారి తీసింది. ఇదంతా సీనియర్ నేత వీహెచ్ ఎదుటే జరిగింది. వీహెచ్ పైకి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం కార్యకర్తలు, బౌన్సర్లు దూసుకెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన వీహెచ్ ఒకనొక దశలో సభను బైకాట్ చేసి బయటకు వెళ్లగా బీసీ నేతల విజ్ఞప్తితో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగించారు. బీసీ ఐక్య వేదికనుఅడ్డుకుని బీసీల అగౌరవపరిచారని.. వీహెచ్ పైకి దాడికి యత్నించాడని డీసీసీ అద్యక్షుడు సాజుద్ ఖాన్ కంది శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బీసీ ఐక్య వేదిక సభ రసాభాసగా మారింది. జిల్లా కాంగ్రెస్ నేతలు సాజిద్ ఖాన్, కంది శ్రీనివాస్ రెడ్డి వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సమక్షంలోనే ఈ రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగారు.
రెండు వర్గాల నేతలకు సర్ది చెప్పినప్పటికీ ఎంతకు వినకపోవడంతో వీహెచ్ సభ నుండి మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా, ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన చేరికను సాజిద్ ఖాన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య బీసీ ఐక్య వేదిక సభలో విభేదాలు బయటపడ్డాయి. అయితే ఈ పరిణామాలపై సీనియర్ నేత వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బౌన్సర్లతో వచ్చి హల్‌చల్ చేస్తానంటే కుదరదని వీహెచ్ కంది శ్రీనివాస్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలకు కూడా వీహెచ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలు ఎంతకు వినకపోవడంతో బయటకు వచ్చేశారు.
ఇక, జిల్లా పార్టీ అధ్యక్షుడైన సాజిద్ ఖాన్.. కంది శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి కొత్తగా వచ్చారని.. ఒరిజినల్ కాంగ్రెస్ ఆచారాలు తెలుసుకోవాలని.. సీనియర్ నేతలపై ఆధిపత్యం చెలాయించాలంటే కుదరదని అన్నారు. ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి చేసింది తప్పని.. మిగిలిన విషయాలను కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో టికెట్ ఎవరికనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కంది శ్రీనివాస్ రెడ్డి చర్యను ఖండిస్తూ కంది శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు మీడియాకు తెలిపారు వెంటనే రాష్ట్ర హైకమాండ్ సైతం కంది శ్రీనివాస్ రెడ్డి పై సస్పెన్స్ కంటిన్యూ చేయాలంటూ కోరారు అవమానిస్తూ బీసీ నేతలు అగౌరవపరిచిన కంది శ్రీనివాస్ రెడ్డి పై అధిష్టానం వెంటనే చర్యలు చేపడుతుందంటూ డిసిసి సాజిద్ ఖాన్ తెలిపారు అయితే సాజిత్ వేసిన బహిష్కరణ వేటు పై కంది శ్రీనివాస్ రెడ్డి స్పందించారు జిల్లా అధ్యక్షుడు తనను సస్పెండ్ చేసే అధికారం లేదంటూ రాష్ట్ర హైకామ్ అండ్ తనపై చర్యలు తీసుకుంటుందంటూ కాంగ్రెస్కు బలమైన నాయకుడి నాయకత్వం అవసరమని అందుకు తను మాత్రమే అర్హుడినంటూ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..