Minister KTR: హస్తానికి ఓటేస్తే అభివృద్ధి అడ్డుకున్నట్లే.. కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ విమర్శలు..

అభివృద్ధికి నిధులు మంజూరు చేసి.. జీవో కాపీని స్టేజ్‌పైనే అందజేశారు. కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్.. హస్తానికి ఓటేస్తే అభివృద్ధి అడ్డుకున్నట్లేనని విమర్శించారు మంత్రి కేటీఆర్. కామారెడ్డిలో జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఎల్లారెడ్డి అభివృద్ధికి 45కోట్లు మంజూరు చేశారు కేటీఆర్‌.. వేదికమీదే జీవో కాపీలను ఎమ్మెల్యే సురేందర్‌కు అందజేశారు. ఎల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు.

Minister KTR: హస్తానికి ఓటేస్తే అభివృద్ధి అడ్డుకున్నట్లే.. కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ విమర్శలు..
Minister KTR
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2023 | 8:32 PM

కామారెడ్డి, ఆగస్టు 14: కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్.. హస్తానికి ఓటేస్తే అభివృద్ధి అడ్డుకున్నట్లేనని విమర్శించారు మంత్రి కేటీఆర్. కామారెడ్డిలో జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఎల్లారెడ్డి అభివృద్ధికి నిధులు మంజూరు చేసి.. జీవో కాపీని స్టేజ్‌పైనే అందజేశారు. కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్.. హస్తానికి ఓటేస్తే అభివృద్ధి అడ్డుకున్నట్లేనని విమర్శించారు మంత్రి కేటీఆర్. కామారెడ్డిలో జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఎల్లారెడ్డి అభివృద్ధికి నిధులు మంజూరు చేసి.. జీవో కాపీని స్టేజ్‌పైనే అందజేశారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించారు బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. కామారెడ్డి, ఎల్లారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

కేటీఆర్ కామారెడ్డి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవునుపల్లి దగ్గర కేటీఆర్‌ కాన్వాయ్‌ అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జీ చేశాయి. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్. 50ఏళ్లలో ప్రజలకు మంచి చేయని కాంగ్రెస్‌.. ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తామని.. పాచిపోయిన పాతనేతలే.. అలవిగాని కొత్తహామీలతో మళ్లీ వస్తున్నారనీ విమర్శించారు. ఈ విష‌యాన్ని ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని రైత‌న్న ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు.

కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉంటే ఢిల్లీలో నిర్ణయాలు జ‌రుగుతాయి. కానీ బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే.. తెలంగాణ‌లోనే నిర్ణయాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు కేటీఆర్. రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను కాపాడేది కేసీఆర్ మాత్రమే.. ఢిల్లీ బానిస‌ల‌తో ఏం కాదని విమర్శించారు కేటీఆర్.

ఎల్లారెడ్డి అభివృద్ధికి 45కోట్లు మంజూరు చేశారు కేటీఆర్‌.. వేదికమీదే జీవో కాపీలను ఎమ్మెల్యే సురేందర్‌కు అందజేశారు. ఎల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. మరోవైపు ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేటీఆర్‌కు మెదక్ జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. ఈనెల 19వ తేదీన మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి హరీష్‌రావు నిర్వహిస్తున్న సమీక్షా సమవేశంలో పాల్గొన్నారు కేటీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!