Telangana Politics: వీహెచ్ పంతం నెగ్గిందా? ప్రేమ్ సాగర్‌పై చర్యలు ఉంటాయా? కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లొల్లి..
Telangana Politics - Congress: కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావుకు నోటీసులు ఇచ్చే విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత..
Telangana Politics – Congress: కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావుకు నోటీసులు ఇచ్చే విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తన పంతం నెగ్గించుకున్నారా. ఈ విషయంలో పార్టీ నేతలపై ఒత్తిడి తేవడంలో వీహెచ్ వ్యూహం ఫలించిందా? ఆదిలాబాద్‌లో బలమైన లీడర్ గా ఉన్న ప్రేమ్ సాగర్ రావు కు ఇచ్చిన నోటీసులు పేరుకేనా.. సీరియస్ నెస్ ఉందా?
వివరాల్లోకెళితే.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా షోకాజ్ నోటీసులో పేర్కోన అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కోంది క్రమశిక్షణ కమిటీ. అయితే ప్రేమ్ సాగర్ రావు కు నోటీసులు ఇచ్చే విషయంలో చివరి నిమిషం వరకు తర్జనభర్జనే పడింది క్రమశిక్షణ కమిటీ. అయితే వీహెచ్ వత్తిడి పెరగడంతో నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రేమ్ సాగర్ రావు కు షోకాజ్ నోటీసులు ఇవ్వకుంటే గాంధీ భవన్ లో మౌన దీక్ష చేస్తానని వీహెచ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో జరిగిన పీఏసీ మీటింగ్ ఇంఛార్జ్ ఠాకూర్ తో పాటు పార్టీ సీనియర్లందరికీ దీనిపై ఫిర్యాదు చేసారు వీహెచ్. ఈ విషయంపై పార్టీలో చాలా రోజులుగా సీరియస్ గా చర్చ నడుస్తుంది.
పార్టీలో సీనియర్ నేత కావడం, నేతలందరిపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు మౌన దీక్ష చేస్తానని ప్రకటించడంతో చివరి నిమిషం వరకు నోటీసులు ఇచ్చే విషయంలో వేచి చూసిన క్రమశిక్షణ కమిటీ వీహెచ్ మౌన దీక్ష ప్రకటనతో ఈ ఇష్యూ మరింత ముదిరే ప్రమాదం ఉందని భావించిన క్రమశిక్షణ కమిటీ.. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో వీహెచ్ తన పంతం నెగ్గించుకున్నారనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఇక మరో వైపు ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నాయకుడు. దీంతో పాటు నాలుగు, అయిదు నియోజకవర్గాల్లో ప్రేమ్ సాగర్ రావు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా పార్టీ సభ్యత్వం విషయంలో లక్షకు పైగా సభ్యత్వాలు పూర్తి చేసి తన బలమేంటో ప్రేమ్ సాగర్ రావు చూపించారు. అయితే ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన నోటీసులు సీరియస్ గానే ఇచ్చారా, లేక వీహెచ్ ఒత్తిడి తో తూ తూ మంత్రంగా ఇచ్చారా అనే సందేహం పార్టీ నేతల్లో ఉంది.
మొత్తానికి పార్టీ నేతలపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చి ప్రేమ్ సాగర్ రావు కు నోటీసులు ఇచ్చేలా చేసారు వీహెచ్. అయితే ఇది షోకాజ్ నోటీసులతోనే ఆగిపోతుందా.. తర్వాత చర్యలు ఏమైనా ఉంటాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also read:
IIT Roorkee Jobs: ఐఐటీ – రూర్కీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Dance With Me: ఉర్రూతలూగిస్తున్న సల్మాన్ ‘డ్యాన్స్ విత్ మి’.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..