CM KCR: ఆ పెద్దాయన అంటే ఆయనకు ఎప్పుడు గౌరవమే.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.. ఇప్పుడు ఆయనే నారాజ్‌.. ఎవరాయన?

ఆ పెద్దాయన అంటే ఆయనకు ఎప్పుడు గౌరవమే.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.. మిగిలిన వాళ్లని ఒక్క మాట కూడా అననిచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ఆయనే నారాజ్‌ అయ్యారు. మాట తప్పారని మండిపడ్డారు.

CM KCR: ఆ పెద్దాయన అంటే ఆయనకు ఎప్పుడు గౌరవమే.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.. ఇప్పుడు ఆయనే నారాజ్‌.. ఎవరాయన?
Cm Kcr Vs Janareddy
Follow us

|

Updated on: Jul 31, 2021 | 9:08 PM

CM KCR slams Janareddy: ఆ పెద్దాయన అంటే ఆయనకు ఎప్పుడు గౌరవమే.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.. మిగిలిన వాళ్లని ఒక్క మాట కూడా అననిచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ఆయనే నారాజ్‌ అయ్యారు. మాట తప్పారని మండిపడ్డారు. ఇంతకీ జానారెడ్డిని కేసీఆర్‌ ఎందుకు విమర్శించారు? అసలేం జరిగింది?

ఎప్పుడూ లేనిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై విరచుకుపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి.ఇంతలా ఆయన విమర్శించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా చాలా అంశాలను ప్రస్తావించారు ముఖ్యమంత్రి. దళిత బంధుపై కొందరు విమర్శలు చేస్తున్నారంటూనే ఎప్పుడో అసెంబ్లీలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. జానారెడ్డి ఇప్పుడు మాట మార్చి నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారంటూ సీఎం కేసీఆర్‌ ఫైరయ్యారు.

గతంలో ఎప్పుడూ ఇలా జానారెడ్డిని సీఎం కేసీఆర్‌ పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. పెద్దలు, జానారెడ్డి గారు అంటూ సంబోధించేవారు. అటు, కాంగ్రెస్‌ పెద్దాయన కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎప్పుడూ వ్యవహరించలేదు. 2018 ముందు వరకు అసెంబ్లీలో లెక్కలు చెప్పి సున్నితంగానే విమర్శలు చేసేవారు జానారెడ్డి. దానికి ముఖ్యమంత్రి కూడా ఓపిగ్గా సమాధానం ఇచ్చేవారు. మిగిలిన ఏ ప్రతిపక్ష సభ్యులకు, అధికార పార్టీ సభ్యులకు మధ్య ఇలా చర్చ జరిగేది కాదు. అలాంటిది సూటిగా జానారెడ్డినే టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి విమర్శించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ సాగుతోంది.

ముక్కు సూటిగా వ్యవహరించే మనస్తత్వం ఉన్న జానారెడ్డి సౌమ్యుడిగా మంచి పేరు ఉంది. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సైతం జానారెడ్డి ప్రశంసించారు. అప్పట్లో 5 రూపాయల భోజనాన్ని తెప్పించుకుని తిని సీఎం కేసీఆర్‌ను అభినందనలతో ముంచెత్తారు జానారెడ్డి. ఆయన పనితో సొంత పార్టీలోనే ఓ రేంజ్‌లో దుమ్ము రేగింది. ఇక, GHMC ఎన్నికల సమయంలో ఇది కాంగ్రెస్‌లో బాగా కాక రేపింది. ఇదొక్కటే కాదు గతంలో పెద్ద సవాలే చేశారు జానారెడ్డి. రెండు పంటలకు నీళ్లు ఇస్తే కండువా మార్చేస్తానన్నారు.

ఇప్పుడా కామెంట్లను ప్రస్తావించి మరీ విమర్శలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి మాట తప్పారని మండిపడ్డారు. సాగర్‌ ఉప ఎన్నిక జరిగి చాలా రోజులైంది. ఇప్పుడే ఎందుకు ముఖ్యమంత్రి విమర్శలు చేశారన్న చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సమయంలో జానారెడ్డికి టీఆర్‌ఎస్‌ ఆఫర్‌ ఇచ్చిందన్న ప్రచారం జరిగింది. ఆయన కాకపోతే జానారెడ్డి కొడుక్కైనా టిక్కెట్‌ ఇస్తారన్న చర్చ నడిచింది. ఆ ఆఫర్‌ను కాదని జానారెడ్డే స్వయంగా పోటీ చేయడంపై గులాబీ దళపతి గుర్రుగా ఉన్నారా? అన్న టాక్‌ నడుస్తోంది. అందువల్లే ఇప్పుడు సందర్భం కాకపోయినా కాంగ్రెస్‌ పెద్దాయనపై కేసీఆర్‌ విమర్శలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. Read Also… TS Covid 19: తెలంగాణలో తగ్గని కరోనా వైరస్.. కొత్తగా 621 కేసులు నమోదు, ప్రస్తుతం 9 వేల యాక్టివ్ కేసులు