Ganapati idols: అత్యద్భుతం.. రైతు పొలం దున్నుతుండగా బయలప్పడ్డ మూషిక వాహనుడైన పురాతన గణపతి విగ్రహం, రాతి పీఠం
సంగారెడ్డి జిల్లాలో అద్భుతం నెలకొంది. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో పొలంలో గణేశుని విగ్రహం, గణపతి పీఠం బయల్పడ్డాయి. అనంత్ రావు దేశముఖ్ అనే రైతు వ్యవసాయ పొలం దున్ను తుండగా..
Ganapati Ancient idols: సంగారెడ్డి జిల్లాలో అద్భుతం నెలకొంది. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో పొలంలో గణేశుని విగ్రహం, గణపతి పీఠం బయల్పడ్డాయి. అనంత్ రావు దేశముఖ్ అనే రైతు వ్యవసాయ పొలం దున్ను తుండగా ఈ సాయంత్రం వేళ అతి పురాతన విగ్రహ సముదాయాలు బయటకొచ్చాయి. భూమి నుంచి మూషిక వాహనుడైన గణపతి ప్రత్యక్షం కావడంతో రైతుతోపాటు పొలంలో పనిచేసే వాళ్లంతా నిశ్చేష్టులయ్యారు.
వెంటనే గణపతి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి రైతులు పూజలు చేశారు. ఈ అపురూప దృశ్యానికి తాము ప్రత్యక్ష సాక్షులమైనందుకు రైతన్నలు మురిసిపోతున్నారు. నిమిషాల్లోనే ఈ వార్త నారాయణ్ ఖేడ్ మండలమంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు.
ఆనాడే, అత్యంత నైపుణ్యంతో చెక్కిన రాతి గణపతి పీఠం మీద ఉన్న మూషికం గురించి కూడా జనం చర్చించుకోవడం కనిపించింది. వినాయకుడు వెలసిన ప్రాంతంలోనే గుడి కట్టాలని తుర్కపల్లి వాసులు కోరుకుంటున్నారు. పురావస్తుశాఖ ఈ విగ్రహాలపై పరిశోధనలు చేసి ఏ కాలంనాటి విగ్రహాలో చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. సమీప భవిష్యత్ లోనే ఈ ప్రాంతం మరో ప్రఖ్యాత గణపతి సన్నిధానం కానుందని చెబుతున్నారు.