AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GarudaPurana : గరుడపురాణం ప్రకారం.. ఈ 4 అలవాట్ల వల్ల మీ అదృష్టం, జ్ఞానం కనుమరుగవుతాయి..!

GarudaPurana : గరుడ పురాణం ప్రధాన దేవుడు విష్ణువు. ఈ మహాపురాణంలో విష్ణువు అతని వాహనం పక్షిరాజ్ మధ్య సంభాషణ జరుగుతుంది. గరుడ పురాణం మరణం

GarudaPurana : గరుడపురాణం ప్రకారం.. ఈ 4 అలవాట్ల వల్ల మీ అదృష్టం, జ్ఞానం కనుమరుగవుతాయి..!
Garudapurana
uppula Raju
|

Updated on: Jul 31, 2021 | 9:25 PM

Share

GarudaPurana : గరుడ పురాణం ప్రధాన దేవుడు విష్ణువు. ఈ మహాపురాణంలో విష్ణువు అతని వాహనం పక్షిరాజ్ మధ్య సంభాషణ జరుగుతుంది. గరుడ పురాణం మరణం తర్వాత కలిగే ఫలితాల గురించి తెలియజేస్తుంది. మరోవైపు మంచి, ధర్మం మార్గాన్ని అనుసరించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది. గరుడ పురాణంలో రాసిన అనేక విషయాలు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందుల నుంచి కాపాడుతాయి. మీ జీవితాన్ని సులభతరం చేస్తాయి. ఈ మహాపురాణంలో పేర్కొన్న ఈ చెడు అలవాట్లు వ్యక్తి నుంచి అదృష్టం, జ్ఞానాన్ని తొలగిస్తుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పురాణ గ్రంథాలలో లక్ష్మి మాత అదృష్టం, శ్రేయస్సును ప్రసాదించే దేవతగా పరిగణిస్తారు. మాతా లక్ష్మికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ధనవంతులు అయినప్పటికీ మురికి దుస్తులు ధరించే వారు, తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోనివారు, శరీరాన్ని సరిగా శుభ్రం చేసుకోనివారి అదృష్టాన్ని లక్ష్మీ మాత లాక్కుంటుంది. వారికి సమాజంలో గౌరవం లభించదు క్రమంగా వైభవం కూడా నాశనం అవుతుంది.

2. ఒక వ్యక్తి నిరంతరంగా ప్రయత్నం చేస్తే ఏ పనిలోనైనా సమర్థతను సాధించగలడని అంటారు. కానీ మనం అభ్యాసాన్ని వదిలేస్తే మనం కష్టపడి చేసిన జ్ఞానాన్ని కూడా మర్చిపోవచ్చు. అభ్యాసం చేయని అలవాటు ప్రజల నుంచి వారి జ్ఞానాన్ని తొలగిస్తుంది.

3. సగం వ్యాధులకు మూలం కడుపు అని చెప్పారు. ఒక వ్యక్తి కడుపు సరిగ్గా ఉంటే అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి. పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గం సమతుల్యత, జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం. అదికాకుండా నిత్యం తినడం గురించి ఆలోచించేవారు తొందరలోనే వ్యాధి బారిన పడతారు.

4. ఈ సమాజంలోని చెడ్డ వ్యక్తుల మధ్య మీరు సురక్షితంగా ఉండాలంటే కొంచెం మీరు తెలివిగా ఉండాలి. లేకపోతే శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు. మీరు తెలివి చూపకపోతే నష్టం మీదే అవుతుంది. అందువల్ల శత్రువుకు చిక్కకుండా బతికే తెలివిని మీరు సంపాదించుకోవాలి.

Bank Account : మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే కచ్చితంగా మీరు ఈ పనులు చేయాలి..! లేదంటే సేవలు రద్దవుతాయి..

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా ఎలా….?సావిత్రి w/o సత్యమూర్తి ..ఆసక్తికరంగా కాన్సెప్ట్..:Savitri W/O Satyamurthy Video.

Ram Pothineni: రామ్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ఇస్మార్ట్ హీరో సరసన అందాల తార..