- Telugu News Photo Gallery Spiritual photos Friendship day 2021 know lord krishna says true friendship meaning about his 4 friends
Friendship Day 2021: స్నేహానికి నిజమైన అర్థం తెలుసా.. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే..
ఫ్రెండ్షిప్ డే.. విదేశాల నుంచి అలవరుచుకున్న ఈ ప్రత్యేక రోజు భారతీయ సంసృతిలో ముందు నుంచే ఉంది. శ్రీకృష్ణుడి కాలంలోనే స్నేహానికి అసలైన అర్థాన్ని తెలియజేశారు. రేపు స్నేహితుల దినోత్సవం. అసలైన స్నేహం అంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుందామా.
Updated on: Jul 31, 2021 | 9:47 PM

శ్రీకృష్ణుని స్నేహితులలో సుదాముడు ముఖ్యుడు. సుదాముడు నిరుపేద.. కానీ శ్రీకృష్ణుడు రాజు. కానీ శ్రీకృష్ణుడు వారి స్నేహం మధ్య ఈ వ్యత్యాసాన్ని అనుమతించలేదు. శ్రీ కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు సుదాముడు ఆర్థిక సహాయం కోసం ద్వారకకు చేరుకున్నప్పుడు శ్రీ కృష్ణుడు అతడిని గుర్తించగలడా లేదా అని సందేహించాడు. కానీ శ్రీ కృష్ణుడి సుదాముడి పేరు వినగానే అతడిని కలవడానికి చెప్పులు లేకుండా వచ్చేసాడు. గౌరవంగా వారిని రాజభవనానికి తీసుకువచ్చారు. అతడు తీసుకువచ్చిన అటుకులను ఇష్టంగా తిన్నాడు.

అర్జునుడు శ్రీకృష్ణుడి సోదరుడు అని పిలిచేవాడు. కానీ అర్జునుడిని కృష్ణుడు స్నేహితుడిగా భావించాడు. కురుక్షేత్ర యుద్దభూమిలో శ్రీ కృష్ణుడు అర్జునుడి రథసారధిగా మారాడు. అర్జునుడు బలహీనంగా ఉన్నప్పుడు అతడిని ప్రోత్సహించాడు. అర్జునుడు తన కౌరవులతో అధర్మానికి వ్యతిరేకంగా పోరాడేలా చేశాడు.

దౌపది శ్రీకృష్ణుడిని తన సోదరుడు, స్నేహితుడిగా భావించింది. వస్త్రాభరణ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని గుర్తుచేసుకోగానే.. ఆమెకు సహాయమందించాడు. కష్ట సమయాల్లో మనం ఎల్లప్పుడూ మన స్నేహితుడికి సహాయం చేయాలని అప్పుడే కృష్ణుడు బోధించాడు.

అక్రూర సంబంధంలో శ్రీ కృష్ణుడి మామ అనిపించుకున్నాడు. శ్రీ కృష్ణుడిని , బలరాముడిని బృందావనం నుండి మథురకు తీసుకెళ్లారు అక్రూర. దారిలో, శ్రీకృష్ణుడు అతని నిజమైన రూపాన్ని చూసేలా చేశాడు. అక్రూర్ శ్రీకృష్ణుని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత తనను తాను సమర్పించుకున్నారు. దేవుడికి, భక్తుడికి మధ్య సంబంధం ఉన్నప్పటికీ, శ్రీ కృష్ణుడు దానిని సహజంగా స్నేహంగా భావించాడు.

స్నేహానికి నిజమైన అర్థం తెలుసా.. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే..




