Telangana Politics: షర్మిల పార్టీకి ఆవిర్భావం రోజే ఝలక్ ఇవ్వబోతున్నారా? ఆది నుంచి ముందున్న ఆమె హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా?
Telangana Politics: ఆ పార్టీ ఇంకా ప్రజల్లోకి రానే లేదు.. అప్పుడే లుకలుకలు.. అభిమానంతో కొందరు పనిచేస్తుంటే, ఎదో ఆశించి ఇంకొంతమంది పార్టీ..
Telangana Politics: ఆ పార్టీ ఇంకా ప్రజల్లోకి రానే లేదు.. అప్పుడే లుకలుకలు.. అభిమానంతో కొందరు పనిచేస్తుంటే, ఎదో ఆశించి ఇంకొంతమంది పార్టీ ఆవిర్భావ సభ కోసం పనిచేస్తున్నారనే ప్రచారం ఉంది. పెట్టని పార్టీలో ఇమడలేక జంప్ కావడానికి అప్పుడే సిద్ధమవుతున్నారు అని చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ పార్టీలో జరుగుతున్న కథేంటి? ఎవరు జంపింగ్ కోసం రెడీగా ఉన్నారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
వంద మంది కలిసి పనిచేయగలరు కానీ.. రెండు జుట్లు ఒక దగ్గర ఇమడలేవన్నది పాత సామెత. ఇది అక్షర సత్యమని ఆవిర్భవించని పార్టీతో తేట తెల్లమయ్యింది. వైఎస్ఆర్ తనయ.. వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్ లో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. ఎందుకు ఆ సెటైర్లు, జోకులు పేలుతున్నాయంటే.. ఆమె వెనుక పనిచేసే అనుచరులలో ఇందిరా శోభన్ గౌడ్ ఒకరు. షర్మిల జిల్లాల పర్యటనలో, అడ్ హాక్ కమిటీలు వేయడంలో కీలకంగా వ్యవహరించారు ఆమె. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇందిరా శోభన్‌కు వైఎస్ షర్మిలతో ఈ మధ్య అస్సలు పోసగడం లేదని టాక్ వినిపిస్తోంది.
అయితే, కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీకి బాగా పనిచేసే కార్యకర్తలు, మాటకి మాట జవాబునిచ్చే దీటైన మహిళలను రేవంత్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో ప్రజా సమస్యలపై, ప్రభుత్వంపై గట్టిగా తన వాణి వినిపించిన ఇందిరా శోభన్‌ని కూడా ఆయన సంప్రదించారట. ఇందిరా ను తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారట. సో, రేవంత్ ఆహ్వానంతో ఇందిరా సోభన్.. షర్మిలను వీడి సొంత గూటికి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉంటే.. ఇందిరా శోభన్ “గౌడ్”… వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలో తన సామాజిక వర్గానికి చెందిన నేతలను ప్రోత్సహించిందని వైఎస్ఆర్ అభిమానులు, ముందు నుండి వైఎఎస్ తో, వైఎస్ఆర్‌సిపి తెలంగాణలో పనిచేసిన కార్యకర్తలు నేరుగా షర్మిల కె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. షర్మిల కోటరిలో ప్రస్తుతం స్ట్రాటజీస్ట్ గా పని చేసిన కాసుల హరిప్రసాద్ గౌడ్ ని, అడ్ హాక్ కమిటీల్లో మరికొంతమందిని తన సామాజిక వర్గానికి చెందిన వారినే ఆమె ప్రమోట్ చేయడంపై, మరీ ముఖ్యంగా ఇందిరా శోభన్ పార్టీ లోకి వచ్చాక మహిళా కార్యకర్తలని కలుపుకుని వెళ్ళలేదనే అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై గత కొన్ని రోజుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై షర్మిల కానీ, మిగతా అనుచరులు కానీ స్పందించలేదు. ఇక కొత్త స్ట్రాటజీస్ట్ గా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియని నియమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్టబోయే పార్టీలో పరిస్థితులు ప్రతికూలంగా మారడం, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం దక్కలేదని కాంగ్రెస్ పార్టీ లో తిరిగి చేరడానికి ఇందిరా శోభన్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ ఆహ్వానం.. షర్మిల పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు అన్ని గమనిస్తున్న ఇందిరా భోభన్.. జూలై 8వ తేదీన పార్టీ ఆవిర్భావం రోజే ఝలక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సమాచారం లోటస్ పాండ్ వర్గాలకు సమాచారం చేరడంతో ముందస్తుగా షర్మిల అనుచరులు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
Also read:
Ambulance Couple: ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తున్న దంపతులు.. ఆర్థిక కష్టాల్లోనూ ఆగని సేవలు
ఇండియాకు రఫెల్ విమానాల అమ్మకంపై ఫ్రాన్స్ లో విచారణ ! నిజంగా అవినీతి జరిగిందా..?
India Vs Srilanka: ‘భారత్‌తో సిరీస్ మేము ఆడం” కాంట్రాక్టుపై సంతకం చేయని శ్రీలంక క్రికెటర్లు..