Telangana: తెలంగాణలో విషాద ఘటన.. డబ్బుల్లేక నాలుగు రోజులుగా చెల్లి శవం వద్దే కూర్చున్న అక్క..
Telangana: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఓ మహిళ తన చెల్లి మృతదేహం
Telangana: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఓ మహిళ తన చెల్లి మృతదేహం వద్ద నాలుగు రోజులుగా ఉంటోంది. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని ప్రగతి నగర్‌లో శ్వేత, స్వాతి అనే అక్కాచెల్లెల్లు నివాసం ఉంటున్నారు. అయితే, శ్వేత ఇటీవ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. దహన సంస్కారాలకు చేతిలో డబ్బులు లేకపోవడంతో నాలుగు రోజులుగా శ్వేత మృతదేహాన్ని ఇంట్లో ఉంచి చెల్లెలు శవం వద్దే ఉంటోంది అక్క స్వాతి. దుర్వాసనను భరిస్తూనే ఉంది. అయితే, ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
Also read:
Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..
CM KCR: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు.. ఫీల్డ్ విజిట్ చేయనున్న మంత్రులు
Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..