AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Elections: బంగారు, వెండి నాణేలంటూ పంపిణీ చేశారు.. తీరా ఓటేశాక చూస్తే..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వేళ రాష్ట్రంలో వరుస షాకింగ్ ఘటన వెలుగు చూస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు బంగారు నాణేలను పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం చేశారు. చెప్పినట్టుగానే పోలింగ్ తేదీ రోజూ నాణేలను పంపిణీ చేశారు. కానీ వాళ్లు ఇచ్చిన నాణేలు నకిలీవని తేలడంతో ఓటర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. సిరిసిల్లా మున్సిపాలిటీ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Municipal Elections: బంగారు, వెండి నాణేలంటూ పంపిణీ చేశారు.. తీరా ఓటేశాక చూస్తే..
Fake Coin Distribution Rocks Telangana Municipal Polls
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 7:53 PM

Share

ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ఓ అభ్యర్థి బంగారు నాణేల పేరుతో నలికీ బంగారు నాణేలను పంపిణీ చేసిన ఘటన సిరిలిల్లా మున్సిపాలిటీ పరిధిలో వెలుగు చూసింది. నగరంలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్నాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కో ఓటరుకు మూడు గురజల బంగారం ఇస్తున్నానని చెప్పి ప్రజలకు పంపిణీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే అభ్యర్థి పంపిణీ చేసింది అసలు బంగారం కాదని.. అవి రాగితో చేసిన నాణేలు అని తేలడంతో ఓటర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఓట్ల కోసం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేస్తావని సదురు అభ్యర్థిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా మేడ్చల్‌ జిల్లాలో సైతం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆలియాబాద్‌లోని 5వ వార్డులో నకిలీ వెండి నాణేల పంపిణీ తీవ్ర కలకలం రేపింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ అభ్యర్థి వెండి నాణేల పంపిణీ పేరుతో నకిలీ నాణేలను పంపిణీ చేశారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం చేశారని.. ఈ ప్రలోభాలపై ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రతిపక్ష పార్టీ నేతలు అంటున్నారు.

అయితే రెండు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసినవి నకిలీ నాణేలు కావడంతో ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అభ్యర్థుల వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు ఎలాంటి చర్యలు తీసుకంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.