AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: తెలంగాణలో మెగా ఫైట్ ఎగ్జామినేషన్ స్టేషన్.. రైల్వేశాఖ కీలక అప్డేట్.. రాష్ట్రానికి సూపర్ బెనిఫిట్..

తెలంగాణకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ తెలిపింది. ఇటీవల హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణెకు బడ్జెట్‌లో హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించిన విషయం తెలిపింది. వీటి వల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరగనుండంగా.. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Indian Railways: తెలంగాణలో మెగా ఫైట్ ఎగ్జామినేషన్ స్టేషన్.. రైల్వేశాఖ కీలక అప్డేట్.. రాష్ట్రానికి సూపర్ బెనిఫిట్..
Railways
Venkatrao Lella
|

Updated on: Feb 11, 2026 | 7:07 PM

Share

తెలంగాణకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మెగా ఫైట్ ఎగ్జామినేషన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో రైల్వేశాఖ నెలకొల్పనున్న తొలి సెంటర్ ఇదే. వరంగల్‌లో ఇప్పటికే రైల్వే తయారీ యూనిట్ ఉండగా.. దీనిని కూడా అక్కడే ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మోగా ఫైట్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో గూడ్స్ వ్యాగన్లు, వాటి భాగాల నిర్వహణ, ఓవర్ హీలింగ్ వంటి పనులు చేపడతారు. గూడ్స్ వ్యాగన్లు సేవలు పూర్తి చేసిన తర్వాత సమగ్ర చెకింగ్‌ ఇక్కడ చేపడతారు. ప్రస్తుతం రామగుండం, బెల్లంపల్లి, కాజీపేటలో ఇలాంటి తరహా సౌకర్యాలు ఉండగా.. అక్కడ సాధారణ నిర్వహణ కార్యకలాపాలు మాత్రమే నిర్వహిస్తున్నారు.

తెలంగాణకు ఉపయోగమేంటి..?

వరంగల్‌లో ఏర్పాటయ్యే ఈ ఫైట్ మెగా ఎగ్జామినేషన్ సెంటర్‌లో వ్యాగన్లను పూర్తిగా విడదీయడంతో పాటు తిరిగి అమర్చడం, ఓవర్ హీలింగ్ సమయంలో వ్యాగన్లను తీసివేసి సాంకేతిక తనిఖీలు చేసి పునరుద్ధరించడం వంటి పనులు చేపడతారు. ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న గూడ్స్ వ్యాగన్‌లను ఏపీలోని రాయనపాడులోని ఓవర్ హలింగ్ స్టేషన్‌కు పంపుతున్నారు. దీని వల్ల ఎక్కువ సమయం పట్టడంతో పాటు అధిక నిర్వహణ ఖర్చులు అవుతున్నాయి. అదే వరంగల్‌లో ఏర్పాటు అయితే ఇక్కడే ఆ పనులు జరుగుతాయి. దీని వల్ల ఈ లాజిస్టిక్స్ జాప్యం తగ్గడం వల్ల సరుకు రవాణా వేగవంతమవుతుంది. అలాగే వ్యాగన్ల లభ్యతను మెరుగుపర్చనుంది. ఈ యూనిట్ వల్ల సెమీ స్కిల్డ్ ఉద్యోగాల పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ నుంచి సిమెంట్, బొగ్గు, ఉక్కు, ఆహార ధాన్యాల వంటి సరఫరా ఈ యూనిట్ వల్ల వేగవంతం కానుంది.

300 ఎకరాల్లో నిర్మాణం

ఈ ఫైట్ మెగా యూనిట్‌ ఎగ్జామినేషన్ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.వెయ్యి కోట్లతో రైల్వేశాఖ చేపట్టనుంది. ఇందుకోసం కాజీపేట, మహబూబాబాద్ జంక్షన్ల మధ్య అనువైన స్థలాన్ని గుర్తించే పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 200 నుంచి 300 ఎకరాల స్థలంలో ఇది నెలకొల్పుతారు. స్థలం గుర్తించిన తర్వాత డీపీఆర్‌ను సిద్దం చేయనున్నారు. అనంతరం చట్టపరంగా అనుమతులు, ఆమోదాలు వచ్చాక టెండర్లను ఆహ్వానించనున్నారు. దశలవారీగా నిర్మాణ పనులను చేపట్టనున్నారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని రైల్వేశాఖ డెడ్ లైన్ పెట్టుకుంది. తెలంగాణలో సరుకు రవాణా వేగవంతం కావడానికి ఈ ప్రత్యేక సెంటర్ అనేది వరంగా మారనుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించి వేగవంతగా కంప్లీట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.