మఖానా తింటే బరువు పెరుగుతారా?

04 May 2026

TV9 Telugu

TV9 Telugu

మఖానా తెలియని వారుండరు. తామర గింజలతో తయారు చేసే మఖానాలో బోలెడన్ని పోషకాలు దండిగా ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఈక్రమంలో తామర గింజలతో ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

క్యాలరీలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కొంతమంది బరువు పెరుగుతుంటారు. అయితే మఖానాతో ఆ సమస్య లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిలో క్యాలరీల శాతం తక్కువ

TV9 Telugu

వీటిలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. ఫలితంగా ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవచ్చు.. బరువునూ నియంత్రించుకోవచ్చు అంటున్నారు నిపుణులు

TV9 Telugu

తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయట

TV9 Telugu

గ్లైసెమిక్‌ ఇండెక్స్ తక్కువగా ఉండే ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయట. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం.. ఎముకలు, దంతాల్ని దృఢంగా మారుస్తాయట

TV9 Telugu

మఖానాలో సోడియం తక్కువ.. పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడానికి సహకరిస్తాయట

TV9 Telugu

మఖానాలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి మీ రోజు వారీ ఆహారంలో మఖానాను తప్పక చేర్చుకోండి