షుగర్‌ రోగులు కొబ్బరి బోండం నీళ్లు తాగొచ్చా..?

04 May 2026

TV9 Telugu

TV9 Telugu

ఎండకు గొంతు తడారిపోతోంది. అలాంటప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేవి కూల్‌ డ్రింక్స్‌. కానీ అవి తాగినప్పుడు బాగానే ఉన్నా మళ్లీ కాసేపటికే దప్పిక వేస్తుంది. సహజసిద్ధంగా దొరికే పానీయాలు దాహం తీర్చడమేకాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇటువంటి వాటిల్లో కొబ్బరి బోండాం నీళ్లు ఎంతో శ్రేష్ఠమైనవి

TV9 Telugu

ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్క కొబ్బరి బోండాం తాగితే పొట్టలో ఎంత హాయిగా ఉంటుందో మరి. ఇటు ఆరోగ్యం అందించడంతోపాటు ఎలాంటి దుష్ప్రభాలు కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు

TV9 Telugu

కొబ్బరి బోండాం నీటిలో అత్యధికంగా కేలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. కాపర్‌ వంటి మినరల్స్‌ ఉండటంతో గుండెకు ఎంతో మంచిది. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో ఉన్న మాంగనీస్ కొవ్వు మెటబాలిజమ్‌, ఎంజైమ్‌ పనితీరు సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది

TV9 Telugu

అయితే ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో కొబ్బరినీళ్లు షుగ‌ర్‌ స్థాయిలను పెంచే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సోడియం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్నవారికి ఇది సరిపోదు

TV9 Telugu

కాబట్టి కొబ్బరి నీటిని సరైన పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది. సాధారణంగా ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు సుమారు 100-150 మిల్లీలీటర్ల వరకు తీసుకోవచ్చు

TV9 Telugu

ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరం దాని పోషకాలను మెరుగ్గా గ్రహిస్తుంది. కొబ్బరి నీరు ఒక సహజమైన, ఆరోగ్యకరమైన పానీయం అయినప్పటికీ ఇది ఏదైనా అద్భుత ఔషధం కాదు

TV9 Telugu

ప్రాసెస్ చేసిన పానీయాలకంటే ఇది మెరుగైనదే కానీ, సాధారణ నీటిని పూర్తిగా భర్తీ చేయదు. ఆర్థికంగా చూస్తే కొంతమందికి ఇది ఖరీదైన ఎంపిక అవుతుంది

TV9 Telugu

అందువల్ల శరీర అవసరాలు, అందుబాటు ఆధారంగా పానీయాలను ఎంచుకోవడం ఉత్తమం. వేసవిలో హైడ్రేషన్ ముఖ్యమ‌ని, పానీయం ఏదైనా కావచ్చు, కానీ మితిమీరకుండా తీసుకోవడం మరింత ముఖ్యమైందని నిపుణులు సూచిస్తున్నారు