AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎకరాకు రూ.10 వేలు

Telangana: తడిసిన ధాన్యం కొనుగోలుపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం, 11 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాను..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎకరాకు రూ.10 వేలు
Subhash Goud
|

Updated on: Oct 31, 2025 | 7:36 AM

Share

Telangana: దేశ వ్యాప్తంగా తుఫాను బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఏపీతో పాటు తెలంగాణలో కూడా వరద ప్రభావం భారీగానే ఉంది. భారీ వర్షాలతో రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాను కారణంగా పంట నష్టాన్ని అంచనా వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ దీంతో పంట నష్టాన్ని అంచనా వేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు అధికారులు.

ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

ఎకరాకు రూ.10 వేలు

ఇవి కూడా చదవండి

ఇక తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. పశు సంపద , ఇళ్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని, దీని గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన పంటలపై సర్వే నిర్వహించి సాయం అందిస్తామని అన్నారు.

తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేస్తాం..

ఇక తడిసిన ధాన్యం కొనుగోలుపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం, 11 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని నష్టం తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. శుక్రవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి.. ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే

తుఫాను కారణంగా పంట నష్టంపై నేడు సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పంట నష్టం, తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశించిన సీఎం.. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: November Bank Holidays: నవంబర్‌లో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?