AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

November Bank Holidays: నవంబర్‌లో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

November Bank Holidays: నవంబర్‌లో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ సెలవులు ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. మీరు..

November Bank Holidays: నవంబర్‌లో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..
Subhash Goud
|

Updated on: Oct 31, 2025 | 6:41 AM

Share

Bank Holidays In November 2025: చాలా మంది ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. వచ్చే నెల అంటే నవంబర్‌లో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ సెలవులు ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. మీరు ప్రతి రోజు బ్యాంకు పనులకు వెళ్తున్నట్లయితే ముందస్తుగా ఈ బ్యాంకు సెలవులను గమనించి ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. మరి నవంబర్‌లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం..

  1. నవంబర్​ 1 (శనివారం): కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో, ఇగాస్​-బగ్వాల్ సందర్భంగా ఉత్తరాఖండ్​లోని బ్యాంకులకు సెలవు.
  2. నవంబర్​ 2 (ఆదివారం): సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  3. నవంబర్​ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తిక పూర్ణిమ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులు బంద్‌.
  4. నవంబర్​ 7 (శుక్రవారం): వంగల పండుగ సందర్భంగా మేఘాలయలో, షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవులు.
  5. ఇవి కూడా చదవండి
  6. నవంబర్​ 8 (శనివారం): కనకదాస జయంతి, రెండో శనివారం సందర్భంగా కర్ణాటక సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  7. నవంబర్​ 9 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  8. నవంబర్​ 11 (మంగళవారం): లహాబ్​ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
  9. నవంబర్​ 16 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  10. నవంబర్​ 22 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  11. నవంబర్​ 23 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  12. నవంబర్​ 25 (మంగళవారం): గురు తేగ్​ బహదూర్​ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్​, హర్యానా, చండీగఢ్​లలో బ్యాంకులు బంద్‌.
  13. నవంబర్​ 30 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

ఈ సర్వీసులు అందుబాటులో..

ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..