AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: భార్యలకు ఈ తేదీల్లో జన్మించిన పురుషులు ఉత్తమ భాగస్వాములుగా ఉంటారట.. కొండంత ప్రేమ!

Numerology: రెండు రాడిక్స్ సంఖ్య కలిగిన అబ్బాయిలు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. కుటుంబ సభ్యులందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో అందరూ వీరిని గౌరవిస్తారు. వీరి మాటకి విలువ ఇస్తారు. ఏదీ ఏమైనా కుటుంబంలో వీరికి మంచి పేరు ఉంటుంది..

Numerology: భార్యలకు ఈ తేదీల్లో జన్మించిన పురుషులు ఉత్తమ భాగస్వాములుగా ఉంటారట.. కొండంత ప్రేమ!
Subhash Goud
|

Updated on: Oct 29, 2025 | 11:09 AM

Share

Numerology: జాతకాలు, వాస్తును నమ్మేవారు ఈ రోజుల్లోచాలా మంది ఉంటారు. అయితే న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పవచ్చంటున్నారు నిపుణులు. ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్య ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఒక మనిషి రహస్యాలు అన్నిటినీ కూడా చెబుతుందని అంటున్నారు.

న్యూమరాలజీ ఒక మనిషి బలహీనత ఏంటి? అలాగే బలాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవచ్చంటున్నారు. మీ కెరీర్‌లో ఎలాంటి విజయం సాధించవచ్చు? ముఖ్యంగా ఓ వ్యక్తి తన వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలు కూడా న్యూమరాలజీ చెబుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యకు మంచి జీవిత భాగస్వాములు అవుతారు. ఎల్లప్పుడూ వారిని ప్రేమగా చూసుకుంటారు. దీని గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు పెళ్లి తర్వాత సంతోషమే..

ఇవి కూడా చదవండి

ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య రెండు అవుతుంది. రెండుకి అధిపతి చంద్రుడు. ఎమోషన్స్, మెదడు, ఆలోచనలు వంటి వాటికీ చంద్రుడు కారకుడు. ఈ సంఖ్యకు చెందిన వారు ప్రశాంతంగా ఉంటారు, కష్టపడి పని చేస్తారు. జీవితం ఆనందంగా సాగుతుంది.

త్వరగా సక్సెస్ అవుతారు

రాడిక్స్ నెంబర్ 2 వారు ఎంతో కష్టపడి పైకి వస్తారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతారు. అంతేకాదు తన ఏకాగ్రతతో అనుకున్న పనులు పూర్తి చేస్తారట. జీవితంలో అన్నింటిని సాధిస్తూ సక్సెస్‌ అవుతారట.

భార్యకు మంచి భర్తగా..

రాడిక్స్ నెంబర్ 2 వారు మంచి భర్తలుగా పేరు తెచ్చుకుంటారు. తమ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడంలో ప్రయత్నిస్తారు. భార్య భావాలను అర్థం చేసుకుంటారు. ఇలా వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

కుటుంబానికి విలువ:

రెండు రాడిక్స్ సంఖ్య కలిగిన అబ్బాయిలు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. కుటుంబ సభ్యులందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో అందరూ వీరిని గౌరవిస్తారు. వీరి మాటకి విలువ ఇస్తారు. ఏదీ ఏమైనా కుటుంబంలో వీరికి మంచి పేరు ఉంటుంది. వీరు ఏ విషయాన్ని చెప్పిన కుటుంబ సభ్యులు వింటారు.

భార్య కలలను నెరవేర్చే భర్తలు:

ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్య కలలను కూడా నెరవేర్చుతారట. ఇలాంటి అబ్బాయిలో భార్యలకు ఎల్లప్పుడు సపోర్ట్‌గా ఉంటారట. అన్ని విధాలుగా అండగా నిలుస్తారట. ఎలాంటి కష్టంలోనైనా భార్యకు అండగా ఉంటూ వెన్నుదన్నుగా నిలుస్తారట.

గమనిక: ఇందులోని సమాచారం న్యూమరాలజీ ఆధారంగా అందించనవి మాత్రమే. ఎవరి నమ్మకాలు వారివి. పూర్తిగా వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయం.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..