Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో ఆహ్వానించాడు.. ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చాడు.. తలసాని స్టైలే వేరుగా
మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్ ప్రకారం సీఎం తప్పనిసరిగా రావాలని ఎక్కడా లేదన్నారు.

Minister Talasani: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు గానూ.. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ(Delhi)లో బయలుదేరి.. 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. మంత్రి తలసానికి వెయిటింగ్ ఇన్ మినిస్టర్‌గా సర్కార్ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘనస్వాగతం పలికింది. ఇక్కడవరకు అంతా బానే ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని రిసీవ్ చేసుకున్న తలసాని.. ట్విట్టర్ వేదికగా మోదీకి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం డైనమిక్ సిటీలో అడుగుపెట్టానని ప్రధాని పేర్కొనగా.. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ఇప్పటికైనా డైనమిక్ సిటీగా గుర్తించినందుకు ధన్యవాదాలు అంటూ తలసాని తన ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రజంట్ ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Landed in the dynamic city of Hyderabad to take part in the @BJP4India National Executive Meeting. During this meeting we will discuss a wide range of issues aimed at further strengthening the Party. pic.twitter.com/fu0z0Xrt5Z
— Narendra Modi (@narendramodi) July 2, 2022
Thank you Hon’ble Prime Minister Sri @narendramodi Ji for recognising Hyderabad as dynamic city which is being developed under the able leadership of Hon’ble Chief Minister Sri KCR Garu. pic.twitter.com/CBNEmf8sST
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 2, 2022
ఇర ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి ఆహ్వానం పలికి బయటకు వచ్చిన అనంతరం కూడా తలసాని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని హైదరాబాద్ బేగంపేటకు చేరుకున్న సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తప్పనిసరిగా రావాలని ఎక్కడా లేదన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా తాను వెళ్లినట్లు చెప్పారు. GHMC ఎన్నికల ముందు ప్రధాని ఆకస్మాత్తుగా వచ్చి వెళ్లిపోయారని గుర్తు చేశారు. బీజేపీకి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో తలపడాలని ఆయన సవాల్ విసిరారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి