Telangana: TRS ఎంపీ నామా నాగేశ్వరరావుకు భారీ షాక్… రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు షాకిచ్చింది ఈడీ. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తోన్న వేళ.. లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావుకు భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన 105 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాంచీ- జంషెడ్‌పూర్ రహదారి పేరిట బ్యాంకుల నుంచి 2012 డిసెంబర్‌లో మధుకాన్ గ్రూప్ కోట్ల లోన్స్ పొంది.. ఆ నిధులను దారి మళ్లించినట్టు అభియాగాలున్నాయి. తాజాగా ఈ కేసులో మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఆరు డొల్ల కంపెనీల ద్వారా నగదు మళ్లింపు జరిగిందని ఈడీ పేర్కొంది. 96.21 కోట్ల విలువైన మధుకాన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ కంపెనీలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య పేర్లతో ఉన్నట్లు తెలిపింది. బెంగాల్‌తో పాటు హైదరాబాద్, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలో రూ.88.85 కోట్ల విలువైన భూములతో పాటు మధుకాన్ షేర్లు…. రూ.7.36 కోట్ల చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. గత ఏడాది జూన్‌లో నామా నాగేశ్వర రావు ఇళ్లతో పాటు మధుకాన్ గ్రూప్ సంస్థల కార్యాయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. అవకతవకలు జరిగినట్లు గుర్తించి.. తాజాగా ఆయన కంపెనీ ఆస్తులు అటాచ్ చేసింది. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ED attaches 105 properties of the Madhucon Group of #TRS MP Nama Nageshwar Rao worth Rs 96.2 Crore, in a Bank #Fraud case, under the provisions of PMLA ?!#EnforcementDirectorate pic.twitter.com/tx5ozfvCsJ
— Arvind Dharmapuri (@Arvindharmapuri) July 2, 2022
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి