AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR America Tour: మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన.. పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా టూర్‌..!

KTR America Tour: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా ఈ అమెరికా పర్యటన కొనసాగనుంది. పారిశ్రామిక..

KTR America Tour: మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన.. పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా టూర్‌..!
Subhash Goud
|

Updated on: Mar 19, 2022 | 8:44 AM

Share

KTR America Tour: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా ఈ అమెరికా పర్యటన కొనసాగనుంది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ (Telangana) ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు. అలాగే మన ఊరు-మన బడి పథకానికి ఎన్‌ఆర్‌ఐల నుంచి పెద్ద ఎత్తున విరాళాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే దేశంలో వేగంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులోనే భాగంగా మంత్రి కేటీఆర్‌ (KTR) అమెరికా టూర్‌ వెళ్లారు. అక్కడ ఎన్‌ఆర్‌ఐలు, పలు పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు మంత్రి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. మంత్రి టూర్‌ ఈ నెల 26 వరకు కొనసాగనుంది.

పెట్టుబడులకు హబ్‌గా తెలంగాణ:

ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు హబ్‌గా మారింది. అమెజాన్, ఫేస్‌బుక్‌, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ సంస్థలు హైద‌రాబాద్‌ను త‌మ వ్యాపార విస్తరణకు కేంద్రంగా మార్చుకున్నాయి. ఒక్క సాఫ్ట్‌వేర్‌ కంప‌నీలే కాకుండా.. ఫార్మా, ఆటోమోబైల్, టెక్స్‌ టైల్స్, బ‌యో, లైఫ్ సైన్సెస్‌లాంటి అనేక రంగాల సంస్థలు తరలివచ్చాయి. అయితే మరిన్ని పెట్టుబ‌డుల‌ను సాధించడమే ల‌క్ష్యంగా.. మంత్రి కేటీఆర్ అమెరికా టూర్‌ కొనసాగనుంది. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబ‌డులు పెట్టాలని వారిని ఆహ్వానించ‌నున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులతో ప్రత్యేక స‌మావేశాల‌లో పాల్గొంటారు.

మన ఊరు-మన బడి పథకానికి నిధుల సమీకరణ:

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం మన ఊరు- మ‌న బ‌డి పథ‌కానికి నిధుల స‌మీక‌ర‌ణ చేయ‌నున్నారు. కోటి రూపాయలు ఆపైన విరాళం ఇచ్చే దాత‌ల పేరును ఆ పాఠ‌శాల‌కు పెడతారు. 20 ల‌క్షలు విరాళం ఇచ్చే దాత పేరును తరగతి గదికి పెట్టనున్నారు. మొత్తానికి ఓ వైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. పథకాల అమలులో ఎన్‌ఆర్‌ఐలను భాగం చేసేందుకు ప్రభుత్వం ఈ పర్యటనను ఉపయోగించుకోనుంది.

ఇవి కూడా చదవండి:

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వయో పరిమితి సడలింపుపై ప్రతిపాదనలు..!

Mla Shakeel Car Accident: జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కీలక మలుపు.. వ్యక్తమవుతున్న అనేక సందేహాలు..!