Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వయో పరిమితి సడలింపుపై ప్రతిపాదనలు..!
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం..

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఈ ఉద్యోగాల ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల (Jobs) కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం భావిస్తున్నారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ఉంది ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేసే ముందు వయో పరిమితి గురించి స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉద్యోగాల భర్తీ కోసం వయోపరిమితిని పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు.
ఈ వయోపరిమితి సడలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొద్ది రోజుల్లోనే నిరుద్యోగులకు ఏజ్ లిమిట్ విషయంలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది. వయోపరిమితి సడలింపు కోసం ఇప్పటికే అధికారులు పలు ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపినట్లు సమాచారం. కేసీఆర్ ఆమోదముద్ర వేస్తే వయోపరిమితిపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వయోపరిమితి ఓసీలకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లు ఉంది. అలాగే దివ్యాంగులకు 44 ఏళ్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి:
