Minister KTR: టిమ్స్‌ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన 150 ఐసీయూ బెడ్స్‌.. గచ్చిబౌలిలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోందని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు

Minister KTR: టిమ్స్‌ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన 150 ఐసీయూ బెడ్స్‌.. గచ్చిబౌలిలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister Ktr Inuagurates 150 Icu Beds In Tims At Gachibowli
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 04, 2021 | 4:16 PM

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోందని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సందర్శించిన మంత్రి.. ఐసీయూలో కొత్తగా ఏర్పాటు చేసిన 150 బెడ్స్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 25శాతం వ్యాక్సిన్లు నిల్వ ఉంచుకోకుండా విదేశాలకు ఎగుమతి చేశారని మండిపడ్డారు. విదేశాల్లో 50 కోట్ల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు నిరుపయోగంగా ఉన్నాయని.. వాటిని వెంటనే తెప్పించి మహమ్మారి బారినుండి ప్రజలను రక్షించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

గ‌చ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిని కేటీఆర్ శుక్ర‌వారం ఉద‌యం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించారు. అనంత‌రం క‌రోనా వార్డుల‌ను కేటీఆర్ క‌లియ‌తిరిగారు. క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి.. వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవ‌ల‌పై ఆరా తీశారు. ఇప్పటికే టిమ్స్ ఆసుపత్రిలో 1,200 బెడ్స్‌తో క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన 150 ప‌డ‌కల‌ను రూ. 15 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా హైసియా స‌భ్యుల‌కు కేటీఆర్ ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్నారు. లాక్‌డౌన్ ముగిసేలోగా రెండో ద‌శ తీవ్రత త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్నారు. మ‌ళ్లీ సాధార‌ణ జీవ‌నం గ‌డిపే అవ‌కాశాలు ఉన్నట్లు వైద్యులు అంచ‌నా వేస్తున్నారు అని తెలిపారు. క‌రోనా విజృంభించిన‌ప్పటి నుంచి విరామం లేకుండా వైద్య సేవ‌లందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఇంటింటి స‌ర్వే ద్వారా కరోనా వైరస్ నివార‌ణ చ‌ర్యలు చేప‌ట్టామ‌న్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో సూప‌ర్ స్ర్పెడ‌ర్ల‌కు ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఇస్తున్నామ‌ని తెలిపారు.

అయితే, ప్రపంచానికే వ్యాక్సిన్ రాజ‌ధానిగా ఉన్నామ‌న్న కేటీఆర్.. కేంద్రం అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల మంద‌కొడిగా వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుంద‌న్నారు. విదేశాల్లో 50 కోట్ల ఆస్ర్టాజెనికా డోసులు నిరూప‌యోగంగా ఉన్నాయ‌న్నారు. టీకాలు కొన‌కుండా ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేశారు. 25 శాతం టీకాలు లేకుండా ఎగుమ‌తి చేప‌ట్టారు. ఇక‌నైనా కేంద్రం మేల్కొని విదేశాల్లోని టీకాలు తెప్పించాల‌ని సూచించారు. టిమ్స్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌తో పాటు వైద్యుల స‌మ‌స్యల‌ను కూడా ప‌రిష్కరిస్తామ‌న్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో విప‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డుతామ‌ని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Read Also….  YS Jagan: ‘జగన్న పాల వెల్లువ’కు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా మరో ముందడుగు..