YS Jagan: ‘జగన్న పాల వెల్లువ’కు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా మరో ముందడుగు..

ఏపీలో పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో అమూల్..

YS Jagan: 'జగన్న పాల వెల్లువ'కు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా మరో ముందడుగు..
Cm Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 04, 2021 | 4:09 PM

ఏపీలో పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో అమూల్ ద్వారా పాల సేకరణనును మరింత విస్తరించి పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశానని, లీటర్‌ పాల ధర కంటే లీటర్‌ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చామన్నారు. పాలసేకరణలో చెల్లించే ధరలు.. మిగిలిన సంస్థల కంటే అమూల్‌ సంస్థలో ఎక్కువగా ఉందన్నారు. అమూల్‌ ద్వారా పాడిరైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. అమూల్ రాకతో వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందన్నారు.

అమూల్‌కు పాలు పోయడం లాభదాయకమని.. పాడి రైతులకు లీటర్‌కు 5 రూపాయల నుంచి 15 వరకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు. పాడి రైతులకు మంచి ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పాల నాణ్యతను తెలుసుకునేందుకు రాబోయే 2 సంవత్సరాల్లో 4వేల కోట్ల రూపాయలతో యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?