IIPE Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే..
IIPE visakhapatnam Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖపట్నంలో ఉన్న ఈ సంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను...
IIPE visakhapatnam Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖపట్నంలో ఉన్న ఈ సంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ నేటి నంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ఐటీ ఆఫీసర్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనుండగా.. వీటిలో రిజిస్ట్రార్ 1, నాన్ టీచింగ్ 17 ఖాళీలు ఉన్నాయి.
* అభ్యర్థులు సంబంధి సబ్జెక్టులో పీజీ, డీగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30ని చివరి తేదీగా నిర్ణయించారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: సోమరిపోతు ఏనుగు వింత చేష్టలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో.. నెట్టింట వైరల్..!
CBI Employees: సీబీఐ డైరెక్టర్ నయా రూల్స్.. ఇక నుంచి ఇవి పాటించాల్సిందే.. లేదంటే అంతే సంగతలు..