CBI Employees: సీబీఐ డైరెక్టర్ నయా రూల్స్.. ఇక నుంచి ఇవి పాటించాల్సిందే.. లేదంటే అంతే సంగతలు..
CBI Employees: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నూతన డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్...
CBI Employees: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నూతన డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్ పరిధిలో పని చేస్తు్న్న అధికారులు, సిబ్బంది.. కార్యాలయాలకు ఫార్మల్ దుస్తుల్లోనే రావాలని తేల్చి చెప్పారు. జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూస్, గడ్డం పెంచుకుని రావడం వంటివి ఇకపై కుదరదన్నారు. ఈ మేరకు సుభోద్ కుమార్ సర్క్యూలర్ జారీ చేశారు.
ఈ సర్క్యూలర్ ప్రకారం.. పురుషులు ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు, ఫార్మల్ షూస్, క్లీన్ షేవ్ చేసుకుని ఆఫీసుకు రావాలి అని పేర్కొన్నారు. అలాగే.. మహిళా ఉద్యోగులు చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్‌లు, ప్యాంట్లు మాత్రమే ధరించాలని అన్నారు. సీబీఐ కార్యాలయాల్లో ఉద్యోగులు జీన్స్, టీ-షర్టులు, స్పోర్ట్స్ షూస్, స్లిప్పర్స్, డైలీ వేర్స్ ధరించడానికి అనుమతి లేదు’’ అని ఆ సర్క్యూలర్‌లో స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సిబిఐ కార్యాలయాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని శాఖల అధిపతులను కోరారు.
ఈ ఉత్తర్వులపై సీబీఐలోని ఓ ఉద్యోగి స్పందించారు. ఆఫ్ ది రికార్డ్‌గా మాట్లాడిన ఆయన.. ప్రతీ అధికారి ఫార్మల్ దుస్తులు ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, కొన్నేళ్లుగా ప్రజలు క్యాజువల్ డ్రెస్‌లు ధరిస్తున్నారు. జీన్స్, టీషర్టులు సాధారణమయ్యాయి. అయితే, ప్రజలకు ఆదర్శంగా ఉండేందుకు అధికారులు ఫార్మల్ కోడ్ షర్ట్, ప్యాంటు, బూట్లు ధరించాల్సిన ఆవశ్యకత చాలా ఉందని ఆ అధికారి చెప్పుకొచ్చారు.
కాగా, సుబోధ్ కుమార్ జైస్వాల్ గత వారం సీబీఐకి 33వ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టింది మొదలు సీబీఐలో వ్యవస్థాగత మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు.
Also read: