Son Of India: “నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని.. మోహన్ బాబు డైలాగ్స్ .. వెరీ ఇంట్రెస్టింగ్ అంటున్న చిరు
Son Of India Teaser : చాలా కాలం గ్యాప్ తర్వాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "సన్నాఫ్ ఇండియా". ఈ సినిమాకు
Son Of India Teaser : చాలా కాలం గ్యాప్ తర్వాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్నాఫ్ ఇండియా”. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్లపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సన్నాఫ్ ఇండియా సినిమా టీజర్‌ను ఇవాళ (జూన్ 4) ఉదయం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు విషెస్ అందించారు.
తాజాగా విడుదలైన సన్నాఫ్ ఇండియా టీజర్ వీడియోకు మెగాస్టార్ చిరంజీవి మాట సాయం చేశారు. మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్న అంటూ చిరు వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. అతడి రూటే అతడి రూటే సెపరేటు.. తను ఎప్పుడు? ఎక్కడ ఉంటాడో? ఎప్పుడు? ఏ వేషంలో ఉంటాడో? ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఎప్పుడు, ఎలాంటి ఆలోచనలను పుట్టిస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్టూ చెప్పలేడు” అని మోహన్ బాబు గురించి చెప్పుకోచ్చారు చిరంజీవి. ఇక ఈ టీజర్ లో మోహన్ బాబు అనేక గెటప్స్ లో కనిపించగా.. మరోసారి అప్పటి మోహన్ బాబును గుర్తుచేశారు. ‘నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ అంటూ మరోసారి తన డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.
టీజర్ వీడియో…
మరిన్ని చదవండి.. Akhil Movie: అఖిల్ సినిమాలో మరో సూపర్ స్టార్.. కీలక పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్ర ?..