Sugarcane Juice: చెరకు రసం దాహార్తిని తీర్చడమే కాదు.. అల్లం, నిమ్మకాయ కలిపి తాగితే ఎన్ని ఆరోగ్యఫలితాలో తెలుసా..!
Sugarcane Juice: వేసవిలో దాహం వేస్తె. చాలా మంది శీతల పానీయాలవైపు చూస్తారు.. అయితే వీటికంటే సహజంగా లభించే పుదీనా వాటర్, కొబ్బరినీరు చెరుకు రసం...
Sugarcane Juice: వేసవిలో దాహం వేస్తె. చాలా మంది శీతల పానీయాలవైపు చూస్తారు.. అయితే వీటికంటే సహజంగా లభించే పుదీనా వాటర్, కొబ్బరినీరు చెరుకు రసం వేసవి దాహార్తిని తీరుస్తాయి. అంతేకాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. స్వచ్ఛంగా తక్కువధరకు లభించే ప్రకృతి ప్రసాదిత చెరుకు రసం తాగడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం!
* చెరకులో ఎక్కువశాతం కాల్షియం ఉండటంతో అది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది. అంతేకాదు, వెన్నెముక బలంగా ఉండటానికి కూడా చెరకు ఉపయోగపడుతుంది. * నీరసంగా ఉన్న సమయంలో గ్లాసు చెరకురసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సూక్రోజు కారణంగా వెంటనే అలసట దూరమవుతుంది. * పిల్లల్లోవ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.. వారిలో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం అందిస్తుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. * గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే, కాలేయ పని తీరు మెరుగుపడుతుంది. * అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచడంలోనూ చెరకురసం అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం ఇందులో రసం తరచుగా తాగేవారికి అజీర్ణ సమస్య దూరంగా ఉంటుంది. * శరీరంలో అధికబరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికీ చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే ఈ రసం శరీరంలోని వ్యర్థాలను కూడా తొలగించగలదు. * రొమ్ము కాన్సర్ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్ కణాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలాయి. * గ్లాసు చెరకు రసానికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్లఉప్పు కలిపి తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. చెరకులో ఉండే విటమిన్ సి, గొంతు నొప్పిని నివారిస్తుంది. అలాగే ఈ రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి చర్మానికీ మేలుచేస్తాయి.
Also Read: నేడు హనుమజ్జయంతి.. ఈరోజు విశిష్టత.. జన్మకథ.. పూజావిధానం.. కలిగే ఫలితాలు..