AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanthi: నేడు హనుమజ్జయంతి.. ఈరోజు విశిష్టత.. జన్మకథ.. పూజావిధానం.. కలిగే ఫలితాలు

Hanuman Jayanthi: ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని భక్తుల నమ్మకం. రామ భక్త పరాయణుడు, బహుపరాక్రమశాలి,..

Hanuman Jayanthi: నేడు హనుమజ్జయంతి.. ఈరోజు విశిష్టత.. జన్మకథ.. పూజావిధానం.. కలిగే ఫలితాలు
Hanuman Jayanthi
Surya Kala
|

Updated on: Jun 04, 2021 | 1:34 PM

Share

Hanuman Jayanthi: ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని భక్తుల నమ్మకం. రామ భక్త పరాయణుడు, బహుపరాక్రమశాలి, ఘోటక బ్రహ్మచారి శ్రీ ఆంజనేయుడి జన్మదినాన్ని “హనుమాన్ జయంతి”గా ఉత్సవాలు చేసుకొంటారు. భారతీయ హిందువులే కాకుండా నేపాల్ లాంటి విదేశాల్లో కూడా విరివిగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి ఏడాదికి రెండు సార్లు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మొదటి మాసమైన “చైత్ర” మాసం “పౌర్ణమి” నాడు“హనుమాన్ జయంతి”ని జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని కొందరు చైత్ర మాసం పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకోవటం గమనార్హం. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మూల నక్షత్రంలో జరుపుకుంటే.. . మహారాష్ట్రలో చంద్రమాన పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకొంటారు. ఇక తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో హనుమజ్జయంతి ని వైశాఖమాసం కృష్ణపక్ష దశమి నాడు జరుపుకుంటారు.కొందరు హనుమాన్ భక్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లలో 41 రోజుల దీక్షను చైత్రమాసం పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖమాసం కృష్ణపక్షం 10రోజున ముగిస్తారు.

హనుమంతునిజన్మవృత్తాంతం:

ఒకనాడు అంజీర” అనబడే ఒక గొప్ప సాధువు స్వర్గాదిపతైన ఇంద్రుడి వద్దకు వెళ్తాడు. ఇంద్రుడు తన నర్తకి తో అంజీరకు స్వగతం పలికి నృత్యకారిణి నృత్యంతో స్వాగతిస్తాడు. భంగిమలతో చేస్తున్న నృత్యాన్ని చూడటం ఇష్టంలేని అంజీర పరమాత్ముని ధ్యానంలో లీనమైపోతాడు. ఈ విషయం గమనించని ఇంద్రుడు మరియు నృత్యకారిణి నృత్యం ఎలా ఉందంటూ అన్జీరను ప్రశ్నిస్తారు. తానూ పరమాత్ముని ధ్యానంలో ఉన్న విషయం సమాధానంగా ఇస్తాడు.ఇంద్రుడు ఇంద్రుడు, నృత్యకారిణి అవమానంగా భావించి అన్జీరను దుర్భాషతో అవమానిస్తారు. కోపోద్రిక్తుడైన అంజీర “నీవు స్వర్గం నుంచి భూమిలో.. ఆడకోతివై పుట్టి అడవుల్లో జీవిస్తావు” అని నృత్యకారిణిని శపిస్తాడు. దీంతో ఆమె వెంటనే సాధువుకు క్షమాపణలు చెప్పి క్షమాభిక్ష వేడుకొంటుంది. శాంతించిన అంజీర “ నీకు పరమాత్ముడిని ఆరాధించే గొప్ప భక్తుడు జన్మిస్తాడు. ఎల్లప్పుడూ పరమాత్ముని సేవలోనే ఉంటాడని” శాపం నుంచి ఉపశమనం కలిగిస్తాడు. నృత్యకారిణి తరువాత వానర రాజైన “కుంజర”కు కుమార్తెగా జన్మిస్తుంది. పిమ్మట కుంజర ప్రవతదీసుడైన “కేసరి” ని వివాహమాడి మహిమాన్విత గుణ సంపననుడు, శ్రీరామ భక్తుడైన “హనుమంతుని”కి శివ, వాయుదేవుల ఆశీస్సులతో జన్మనిచ్చింది. ఆంజనేయుని జన్మగురించి వేర్వేరు పురాణగాధలు ఉన్నాయి. వాయునందునిగా కూడా భావించి పూజలను చేస్తారు. మరో కథ ప్రకారం అంజనాదేవి భర్త కేసరి శిశువు కోసం శివుడిని ప్రార్ధించారు. శివుడి దర్శకత్వంలో, వాయువు తన అంశతో అంజనాదేవి గర్భం పండేట్లు వరమిస్తాడు. దీని ప్రకారం, హనుమంతుడు వాయు కుమారుడుగా కీర్తించబడ్డాడు.

హనుమజ్జయంతి పూజా విధానం:

హనుమజ్జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్ర జయము కలుగును. 5 సంఖ్య హనుమంతునికి చాల ప్రీతి కరమైనది కావునా హనుమాన్ మందిరమునకు 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు , మామిడి పళ్ళు నైవేద్యం పెట్టుట వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు గల మండలం రోజుల పాటు ప్రతిరోజూ 1, 3, 5, 11, లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగును. మండలం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ప్రతి నిత్యం అరటిపండు నివేదించి, ఆ పండును ప్రసాదంగా తీసుకొన్నచో సంతానం తప్పకుండ కలుగుతుందని భక్తుల నమ్మకం. హనుమజ్జయంతి రోజున సింధూర వర్ణ వస్త్రములు ధరించడం, రామాలయాన్ని దర్శించుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగును. హనుమంతుడి ఆరాధన వల్ల ఫలితములు: శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం.జాతకరీత్యా శని గ్రహ దోషంతో బాధపడుతున్న వారు హనుమంతుడిని పూజించుట చేత గ్రహశాంతి ని పొందెదరు.ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు ఆంజనేయుడిని స్మరించినవారికి మృత్యుభయం తొలగుటతో పాటుగా సర్వత్ర విజయం లభిస్తుంది.

Also Read: ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్షేత్రానికి కలియుగాంతానికి లింక్ ఉందని భక్తుల నమ్మకం.. కాలజ్ఞానంలో కూడా ప్రస్తావన