AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid -19: పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ 5 ఆహార పదార్థాలు తప్పనిసరి..!

Covid - 19: మనిషి శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిందే...

Covid -19: పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ 5 ఆహార పదార్థాలు తప్పనిసరి..!
Childrens
Shiva Prajapati
|

Updated on: Jun 03, 2021 | 11:50 PM

Share

Covid – 19: మనిషి శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిందే. అయితే, ఈ వైరస్ మెదడుపై కూడా అటాక్ చేస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గ్లోబల్ కౌన్సిల్ ఆన్ బ్రెయిన్ హెల్త్ ప్రకారం.. కరోనా వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అయితే, భయపడాల్సిన పనిలేదంటున్నారు వైద్య నిపుణులు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మెదడును మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

మనం తీసుకునే పోషకాహారమే మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ముఖ్యంగా జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడం , మెదడు పనితీరును మెరుగుపరచడంలో పోషకాహారం సహాయపడుతుంది. కారణం.. శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే, మెదడు కూడా మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది. ఆ కారణంగా పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. మరి వైద్య నిపుణులు చెబుతున్న పోషకాహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్లు.. అల్పాహారం సమయంలో పిల్లలకకు పిండి పదార్థాలు, ప్రోటీన్, తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వుతో నింపడం ఉత్తమం. అలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ అందించడం వల పిల్లలు రోజంతా చలాకీగా ఉంటారు. గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బోనస్‌గా కోలిన్ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి పెరుగుదలకు సహాయపడుతుంది.

వోట్స్.. వోట్స్ మెదడుకు అద్భుతమైన శక్తి వనరులు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పిల్లలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అలాగే జంక్ ఫుడ్ వైపు ఆసక్తి చూపకుండా చేస్తుంది. వోట్స్‌లో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, జింక్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు చురుగ్గా పని చేయడానికి ఉపకరిస్తాయి. వోట్స్‌లో ఆపిల్, అరటి, బ్లూబెర్రీ లేదా బాదం వంటి ఏదైనా కలిపి ఇస్తే ఇంకా ఉత్తమం.

కూరగాయలు.. ఫ్రెష్ కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. టొమాటో, చిలగడదుంపలు, గుమ్మడికాయ, క్యారెట్లు, బచ్చలికూర మీ పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. కొన్ని కూరగాయలను సాస్, సూప్‌లా ఇవ్వవచ్చు.

పాల ఉత్పత్తులు.. పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్, విటమిన్ బి అధికంగా ఉంటాయి, ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్‌మిటర్లు, ఎంజైమ్‌ల అభివృద్ధికి అవసరం అవుతాయి. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఆహార పదార్ధాలలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బలమైన దంతాలు, ఎముకల అభివృద్ధికి దోహదపడుతాయి. పిల్లల కాల్షియం అవసరాలు వారి వయస్సును బట్టి మారుతుంటాయి. కాని ప్రతిరోజూ కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తినడం ద్వారా మంచి ఆరోగ్యం పిల్లల సొంతం అవుతుంది.

చిక్కుళ్ళు… మీ పిల్లలకు తినిపించే ఆహారం బీన్స్ చేర్చండి. ఈ బీన్స్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా ఉంటాయి. పింటో బీన్స్, ఇతర బీన్స్ కంటే ఒమేగా 3 ను అధికంగా కలిగి ఉంటాయి. కట్ చేసిన బీన్స్‌ను సలాడ్ మీద చల్లుకోవచ్చు.