AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

When Sleep Hurts: నులక, పట్టె మంచాలు వాడితే వెన్నె నొప్పి, గర్భాశయ ఇబ్బందులు రావా..మన పూర్వీకులుశాస్త్రవేత్తలేనా..!

When Sleep Hurts: మనపూర్వీకులు మనకు అందించిన ఆహారం, వస్తువులు అన్నీ కాలక్రమంలో ఆధునికత పేరుతో డిఫరెంట్ లుక్ ను సంతరించుకున్నాయి. కుండల్లో వంటల బదులు స్టీల్ పాత్రలు..

When Sleep Hurts: నులక, పట్టె మంచాలు వాడితే వెన్నె నొప్పి, గర్భాశయ ఇబ్బందులు రావా..మన పూర్వీకులుశాస్త్రవేత్తలేనా..!
Rope Cot
Surya Kala
|

Updated on: Jun 04, 2021 | 3:19 PM

Share

When Sleep Hurts: మనపూర్వీకులు మనకు అందించిన ఆహారం, వస్తువులు అన్నీ కాలక్రమంలో ఆధునికత పేరుతో డిఫరెంట్ లుక్ ను సంతరించుకున్నాయి. కుండల్లో వంటల బదులు స్టీల్ పాత్రలు ఇప్పుడు ఒవేన్ అంటూ ప్లాస్టిక్ పాత్రలు వచ్చి చేరాయి. శారీరక శ్రమ చేసి.. హాయిగా ఆరుబటయ నులక మంచం పట్టెం మంచం మీద నిద్రించే నిద్ర.. ఇప్పుడు డబుల్ కాట్ అయ్యింది. అయితే అప్పటివారు ఎంత పని చేసినా.. వెన్ను నొప్పి అనేవారు కాదు.. అప్పటి మహిళలు ఎంతమంది పిల్లలని కన్నా.. గర్భాశయ ఇబ్బందులను ఎదుర్కొనేవారు కాదు అని చెప్పవచ్చు.. అంటే మన పూర్వీకులు తమ దైనందిన జీవితంలో ఎన్నో ఆచరించేవారు.. ఇంకా చెప్పాలంటే వారు పట్టభద్రులు కాని శాస్త్రజ్ఞులు. అవును మంచం నిద్రించడానికి మన పూర్వీకుల ఉత్తమ ఆవిష్కరణ. మన పూర్వీకులకు కలపను ఎలా కత్తిరించాలో తెలియదా? వారికి చెక్కను అందమైన డబుల్ కాట్ గా తయారు చేయడం రాదా అంటే .. వచ్చు.. కానీ అప్పటి వారికి శారీరక తీరుపై. విశ్రాంతి పై మనిషి జీవన విధానంపై ఒక అవగాన ఉంది. మంచం ఒక శాస్త్రం కానప్పటికీ, శరీరం ఎలా ఎక్కువ విశ్రాంతి పొందగలదో ఒక అవగాహన ఉంది. అందుకనే అప్పటి వారింట్లో నులకమంచం తప్పనిసరిగా ఉండేది. ఇక మంచం నేత కూడా ఒక కళ. ఇది తాడుతో అల్లినది మరియు మనస్సు మరియు కృషి అవసరం. మనిషి నిద్రపోతున్నప్పుడు, కడుపుకి తల మరియు కాళ్ళ కంటే ఎక్కువ రక్తం అవసరం; ఎందుకంటే ప్రజలు రాత్రి లేదా మధ్యాహ్నం తిన్న తర్వాత మాత్రమే నిద్రపోతారు. కడుపు జీర్ణక్రియకు ఎక్కువ రక్తం అవసరం. అందువల్ల, నిద్రపోయేటప్పుడు ఒక మంచం మాత్రమే ఈ ఆరోగ్యానికి ప్రయోజనాలను తెస్తుంది. మంచం మీద పడుకోవడం వల్ల వెన్నునొప్పి ఎప్పుడూ రాదు. నొప్పి ఉన్నప్పుడు మంచం మీద పడుకోవడం మంచిది.

ఇక గదిని ఆక్రమించే డబుల్ బెడ్ కింద చీకటిగా ఉంటుంది, వ్యాధుల సూక్ష్మక్రిములు దానిలో పెరుగుతాయి, బరువు ఎక్కువగా ఉంటే, ప్రతిరోజూ శుభ్రం చేయలేము. అదే నులక మంచం కానీ పట్టే మంచం అయితే ప్రతి ఉదయం మంచం లేపి శుభ్రం చేస్తారు, సూర్యరశ్మి కోసం మంచం ఎండలోఉంచుతారు. దీనివలన బెడ్‌బగ్స్ మొదలైనవి రావు. ఒక వైద్యుడు ఎవరికైనా బెడ్ రెస్ట్ సూచించినట్లయితే,అటువంటి వారు భారతీయ మంచం చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో, ఇంగ్లీష్ బెడ్ వేడిగా మారుతుంది, కాబట్టి ఎసికి ఎక్కువ అవసరం. అంత ఎందుకు వేసవిలో టెర్రస్ మీద మంచం వేసి నిద్రపోతే కలిగే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వచ్ఛమైన గాలి, మారుతున్న వాతావరణం, నక్షత్రాల నీడ, చంద్రుడి చల్లదనం జీవితాన్ని ఉత్సాహంతో నింపుతాయి. అందుకనే మన భారతీయ సంప్రదాయమైన నులక మంచం ప్రతి ఇంట్లోనూ ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వెన్నె నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసేబదులు దేశీయ మంచం ఇంట్లో ఉంటె ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.

Also Read:  చెరకు రసం దాహార్తిని తీర్చడమే కాదు.. అల్లం, నిమ్మకాయ కలిపి తాగితే ఎన్ని ఆరోగ్యఫలితాలో తెలుసా..!