Covid 19 Vaccine: అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. 22 కోట్ల మందికి అందిన టీకా

కరోనా పోరులో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 22 కోట్లు దాటిన వ్యాక్సినేషన్లు.. 25 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్స్.. దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది.

Covid 19 Vaccine: అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. 22 కోట్ల మందికి అందిన టీకా
Covid Vaccine
Follow us

|

Updated on: Jun 04, 2021 | 5:27 PM

Covid 19 Vaccination In India: కరోనా పోరులో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 22 కోట్లు దాటిన వ్యాక్సినేషన్లు.. 25 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్స్.. దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

Covid Vaccine

Covid Vaccine

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 22 కోట్ల 6 లక్షల 58 వేల 489 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 17 కోట్ల 64 లక్షల 35 వేల 90 మందికి మొదటి డోస్‌ అందగా.. 4 కోట్ల 42 లక్షల 23 వేల 399 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 10 లక్షల 61 వేల 794 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. ఏపీలో ఇప్పటి వరకు కోటి 4 లక్షల 37 వేల 706 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 78 లక్షల 80 వేల 804 మందికి మొదటి డోస్‌ అందగా.. 25 లక్షల 56 వేల 902 మందికి రండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 63 లక్షల 54 వేల 571 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 50 లక్షల 65 వేల 564 మంది. రెండో డోస్‌ పూర్తైన వారు 12 లక్షల 89 వేల ఏడుగురు.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 19 కోట్ల 55 లక్షల 5 వేల 695 మందికి covisheild అందితే.. 2 కోట్ల 51 లక్షల 37 వేల 635 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి. అవర్ వరల్డ్ ఇన్ డేటా ప్రకారం.. భారతదేశంలో కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 17.2 కోట్ల మంది కాగా, వ్యాక్సిన్ మొదటి మోతాదును పొందినవారితో పోల్చేతే మన దేశం అమెరికాను అధిగమించామని నీతి ఆయోగ్ ఆరోగ్యం సభ్యులు డాక్టర్ వి.కె పాల్ తెలిపారు.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 25 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 25 కోట్ల 73 లక్షల 35 వేల 803 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 10 కోట్ల 27 లక్షల 356 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 15 కోట్ల 46 లక్షల 35 వేల 445 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

Read Also…  Delta Variant: దేశంలో సెకండ్‌వేవ్‌ కల్లోలానికి డెల్టా వేరియంటే కారణమా..? నిపుణుల అధ్యయనంలో సంచలన నిజాలు!