AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Variant: దేశంలో సెకండ్‌వేవ్‌ కల్లోలానికి డెల్టా వేరియంటే కారణమా..? నిపుణుల అధ్యయనంలో సంచలన నిజాలు!

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతికి కారణం.. డెల్టా వేరియంట్‌గా గుర్తించారు నిపుణులు. ఈ స్థాయిలో వైరస్‌ విజృంభణకు బి.1.617.2నే కారణమని తేల్చారు.

Delta Variant: దేశంలో సెకండ్‌వేవ్‌ కల్లోలానికి డెల్టా వేరియంటే కారణమా..? నిపుణుల అధ్యయనంలో సంచలన నిజాలు!
Delta Variant Behind India's Second Wave Of Covid 19
Balaraju Goud
|

Updated on: Jun 04, 2021 | 5:07 PM

Share

Delta Variant in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత సంవత్సరం కరోనా కేసులు రెండు లక్షలకు పైగా నమోదైతే.. ఈ సంవత్సరం మూడు లక్షలకు పైగా కేసులు నమోదై భయాందోళనకు గురిచేసింది. ఇక మరణాల సంఖ్యపరంగా చూస్తే.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే.. ఇంకా ఎక్కువ సంభవించి ఉంటాయని ఆరోగ్య నిపుణులు సైతం వెల్లడించారు. దేశంలో ఇంత వినాశనాన్ని సృష్టించిన కరోనా వైరస్‌ వేరియంట్‌ను ‘డెల్టా’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌కి చెందిన టెక్నికల్‌ లీడ్‌ మరియా వాన్‌ కెర్ఖోవ్‌ తెలిపారు.

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతికి కారణం.. డెల్టా వేరియంట్‌గా గుర్తించారు నిపుణులు. ఈ స్థాయిలో వైరస్‌ విజృంభణకు బి.1.617.2నే కారణమని తేల్చారు. ఈ స్ట్రెయిన్‌ బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌ కన్నా డేంజర్‌ అని వెల్లడించారు. ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జెనోమిక్‌ కన్సార్టియాతో పాటు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ NCDC అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

బ్రిటన్‌ దేశంలో గుర్తించిన ఆల్ఫా రకంతో పోలిస్తే డెల్టా స్ట్రెయిన్‌ 50శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేల్చారు నిపుణులు. ఈ డెల్టా వేరియంట్‌ అన్ని రాష్ట్రాల్లో ఉందన్న అధ్యయన బృందం..ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువ మందికి సోకినట్లు వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్‌లో భారతదేశాన్ని తాకింది. రోజువారీ సంఖ్య 4 లక్షలకు పెరిగింది. మరణాల సంఖ్య 4,000 కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. భారత దేశంలో 2020 మార్చిలో మహమ్మారి వ్యాపించినప్పటి నుండి ఇప్పటివరకు 2,85,74,350 కేసులు, 2,65,97,655 రికవరీలు, 3,40,702 మంది ప్రాణాలను కోల్పోయారు. పాజిటివిటీగా రెండవ వేవ్ క్షీణిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గత వారం నుండి రేటు 10 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.

అయితే, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా ఇప్పటివరకు 12వేల 200 వేరియంట్లను గుర్తించామని..ఐతే ఈ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే వాటి ప్రభావం తక్కువగానే ఉందని ప్రకటించారు. మరోవైపు వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి సైతం డెల్టా వేరియంట్‌ రకం సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అయితే, కొత్త రకం వేరియంట్ కారణంగానే ఎక్కువ మరణాలు, వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్న కేసులను తాము గుర్తించలేదని పేర్కొన్నారు నిపుణులు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19కు సంబంధించి B.1.617.1, B.1.617.2 రెండు వేరియంట్‌లను భారతదేశంలో మొదట గుర్తించింది. దీనిని ‘కప్పా’ ‘డెల్టా’ గా గ్రీకు వర్ణమాలలను ఉపయోగించి నామకరణం చేసింది. ఈపేర్లకు అర్థం కళంకం. దేశంలో ఫస్ట్‌వేవ్‌ను మించి హడలెత్తించింది సెకండ్‌వేవ్‌. ఎటు చూసినా కరోనా విలయతాండవమే. లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేలాదిమంది కొవిడ్‌ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌, బెడ్స్‌ కొరతతో అల్లాడిపోయారు బాధితులు. అయితే, దేశంలో సెకండ్‌వేవ్‌ ఉధృతికి డెల్టా వేరియంటే కారణమంటోంది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ NCDC అధ్యయనం. లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ ప్రభావం ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసులు 4 లక్షల నుంచి దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా లక్షా 32వేల కేసులు రికార్డయ్యాయి. ఇటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఇవాళ 17వందల మంది మృతి చెందారు.

Read Also….  Nellore GGH Sexual Harassment: వైద్యవిద్యార్థినికి నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ లైంగిక వేధింపులు.. ఘటనపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌