Gautam Sawang : కరోనా వేళ పౌర సమాజం, ఎన్జీవోల అమూల్యమైన సమాజ సేవలను “మానవత్వ ధీర” గా గుర్తిస్తాం : ఏపీ డీజీపీ
మరెంతోమంది ముందుకు వచ్చి ఇటువంటి మహత్తర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, వారు సైతం సమాజానికి స్పూర్తిదాయకంగా నిలవాలని కోరుతున్నామని సవాంగ్ పౌర సమాజ సేవకుల్ని సత్కరిస్తూ పిలుపునిచ్చారు..
DGP Gautam Sawang interacts and felicitates people from Civil Society and NGOs : అత్యంత స్వల్పకాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించి మానవ సమాజంపైన తీవ్ర ప్రభావం చూపించింది.. ఆర్ధికంగా, సామాజికంగానే కాకుండా బంధాలు, బాంధవ్యాలను, విలువలను సైతం దూరం చేసి ఎన్నో కుటుంబాలల్లో విషాదాన్ని మిగిల్చింది అని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. కన్న తల్లిదండ్రులు మృతి చెందితే పిల్లలు అంతక్రియలు జరపలేని దుర్బర స్థితులకు తీసుకువచ్చింది ఈ కరోన. ఒక కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోతే… మరో కుటుంబం ఇంటి ఇల్లాలును కోల్పోయింది.. మరో కుటుంబంలో అభం శుభం తెలియని చిన్నారులు తమ తల్లిని, తండ్రిని, ఇద్దరినీ కోల్పోయిన ఘటనలు ఉన్నాయని సవాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుంచి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సవాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందడం లాంటి పరిస్థితులలో, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మశానానికి తీసుకు వెళ్ళడానికి కుటుంబ సభ్యులు సైతం ధైర్యం చేయని పరిస్థితి ఈ మహమ్మారివల్ల దాపురించిందని ఆయన తెలిపారు. అంతటి కష్టకాలంలో ఏమీ ఆశించకుండా నిస్వార్ధంగా ప్రాణాలకు తెగించి జాతి, కులం, మతం, ప్రాంతం, భాషతో తారతమ్యం లేకుండా మానవత్వమే పరమావధిగా వారికి అంతిమ సంస్కారాలు జరిపిస్తూ ఎంతోమంది ఆపద్బాంధవులయ్యారని డీజీపీ.. పౌర సమాజం, ఎన్జీవోల సేవల్ని కొనియాడారు.
ఈ విపత్కర పరిస్థితిలో ఎంతో మంది తమ వంతు బాధ్యతగా సేవ చేస్తున్నారు..అందరినీ చేరుకోలేకపోయినా వారిలో అందుబాటులో ఉన్న కొంతమందిని సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. అంటూ సవాంగ్ అన్నారు. కరోన కష్టకాలంలో మీరు చూపించిన సహృదయం, మానవతా దృక్పథం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని.. ఇటువంటి గొప్ప వ్యక్తులను గౌరవించడం అంటే మానవ సమాజంలో ఉన్న మానవత్వాన్ని గౌరవించడమని దీనిని అదృష్టంగా భావిస్తున్నానని సవాంగ్ పేర్కొన్నారు. మీరు చేస్తున్న ఈ వెలకట్ట లేని సేవలను స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని మరెంతోమంది ముందుకు వచ్చి ఇటువంటి మహత్తర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, వారు సైతం సమాజానికి స్పూర్తిదాయకంగా నిలవాలని కోరుతున్నామని సవాంగ్ పౌర సమాజ సేవకుల్ని సత్కరిస్తూ పిలుపునిచ్చారు.
ఈ కరోన కష్ట కాలంలో పోలీసులు సైతం తమ కుటుంబాలను వదిలి నెలల తరబడి ప్రజారోగ్య రక్షణలో విధులు నిర్వహిస్తూ ఎందరో ప్రాణాలను కోల్పోయారని. . మరెందరో వేల మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారని సవాంగ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ మీరు అందిస్తున్న ఈ అమూల్యమైన సమాజ సేవలకుగాను “మానవత్వ ధీర”గా గుర్తిస్తుందని ఆయన తెలిపారు. కొవిడ్ క్లిష్ట సమయంలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా మానవ్యతంతో ముందుకు వచ్చి నిస్వార్ధంగా తమకు తోచిన విధంగా వివిధ రూపాల్లో తమవంతు బాధ్యతగా మానవత్వం తో సేవలను అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం, ఎపి పోలీస్ శాఖ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుందని డీజీపీ తెలిపారు.
Acknowledging the Bravehearts who have been providing #DignityInDeath: AP DGP Gautam Sawang appreciates the nameless, faceless & selfless individuals & groups who have joined hands & worked shoulder to shoulder with #APPolice to serve the society during this time of #pandemic. pic.twitter.com/soVt8MgXaP
— Andhra Pradesh Police (@APPOLICE100) June 4, 2021