Jagadeesh Reddy: కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై మంత్రి జగదీశ్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రచారం హోరా హోరాగా సాగుతోంది. నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సూర్యాపేట ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చేది ఉందా.. సచ్చేదుందా ఏదో హామీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనేలా ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రచారం హోరా హోరాగా సాగుతోంది. నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సూర్యాపేట ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చేది ఉందా.. సచ్చేదుందా ఏదో హామీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనేలా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోను ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలన్నారు. పిట్టల దోర కోతల్లా ఉన్నాయంటూ విమర్శించారు. ఒక్క చాన్స్ అంటూ కాంగ్రెస్ గుప్పించిన ఆరు హామీలను చూస్తుంటే ‘ముసలి పులి-బంగారు కంకణం’ కథ గుర్తుకురాక మానదు అన్నారు. ఆశ చూపి అమాంతంగా మింగేయడం వయసుడిగిన కాంగ్రెస్ పులికి అలవాటే అని విమర్శించారు. కానీ తెలంగాణ ఓటర్లు ఆశ చూపితే బుట్టలో పడిపోయేంత అమాయకులు కారు అన్నారు. మరోవైపు కర్ణాటక సక్సెస్ మీద తెలంగాణ కాంగ్రెస్ మరీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టే కనిపిస్తున్నది అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..