Harish Rao at Yadadri: యాదాద్రీశుడి సేవలో మంత్రి హరీశ్‌రావు.. సిద్ధిపేట్ ప్రజా ప్రతినిధుల తరుఫున కేజీ బంగారం అందజేత
యాదాద్రి నర్సన్నకు... స్వర్ణ వితరణ కొనసాగుతోంది. సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు.. తోచినంత బంగారాన్ని స్వామి వారికి సమర్పించుకుంటున్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్‌రావు స్వామివారిని దర్శించుకున్నారు.
Harish Rao Visits Yadadri Temple: యాదాద్రి నర్సన్నకు… స్వర్ణ వితరణ కొనసాగుతోంది. సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు.. తోచినంత బంగారాన్ని స్వామి వారికి సమర్పించుకుంటున్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా(Siddipet District) ప్రజాప్రతినిధుల(Public Representatives)తో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Harishrao) స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజల తరుఫున ప్రజా ప్రతినిధులతో కలిసి యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం కోసం కేజీ బంగారం విరాళంగా ఇచ్చారు.
దేశంలోనే గొప్ప పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా యాదాద్రి దేవాలయం మారబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్న ఆయన… ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం కోసం సిద్ధిపేట నియోజకవర్గం తరపున కిలో బంగారాన్ని అందజేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సిద్దిపేట ప్రజా ప్రతినిధులతో కలిసి… ఆలయ ఈవో గీతకు బంగారాన్ని అందజేశారు. అనంతరం స్వామివారి నూతనాయాన్ని పరిశీలించారు.
విమాన గోపురం స్వర్ణ తాపడనికి దాతల తరపున 35 కేజీల బంగారం సమకూరిందన్నారు మంత్రి హరీశ్ రావు. మరో 45 కేజీల బంగారం అవసరమవుతుందనీ.. దాతల సాకారంతో దైవకార్యం నిర్విఘ్నంగా సంపూర్ణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే యాదాద్రి ఆలయం మహాద్భుతంగా సిద్ధమైందని హరీశ్ రావు చెప్పారు.
రాబోవు రోజుల్లో యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున.. గుట్టలో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు హరీశ్‌రావు. అనంతరం యాదాద్రి ప్రధానాలయం పనులను పరిశీలించిన మంత్రి.. మార్చిలోనే ప్రధానాలయ ఉద్ఘాటనకు కేసీఆర్ సంకల్పించినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో యాదాద్రి పరిసర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు.
Read Also…. Statue of Equality: నభూతో, నభవిష్యతిః అన్నట్లుగా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండోరోజు ఉత్సవ విశేషాలు