CBI Case: సీబీఐ కేసులో విచారణ.. ఢిల్లీకి వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర..

మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర రేపు ఢిల్లీ వెళ్తారు. సీబీఐ ముందు హాజరవుతారు. ఇటీవలే ఈ ఇద్దరిపై ఈడీ రైడ్స్ జరిగాయి. ఇప్పుడు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

CBI Case: సీబీఐ కేసులో విచారణ.. ఢిల్లీకి వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర..
Minister Gangula Kamalakar
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2022 | 9:56 PM

మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర రేపు ఢిల్లీ వెళ్తారు. సీబీఐ ముందు హాజరవుతారు. ఇటీవలే ఈ ఇద్దరిపై ఈడీ రైడ్స్ జరిగాయి. ఇప్పుడు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎందుకు? ఏంటా వివాదం? ఇప్పుడు తెలుసుకుందాం.. మంత్రి గంగుల ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. ఈ వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ హల్చల్‌ చేసింది. అయితే కేవలం ఓ కేసులో సాక్షిగా మాత్రమే పిలిచారంటూ మంత్రి గుంగుల క్లారిటీ ఇచ్చారు. ఏం జరిగిందో చెప్పాలంటూ సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇదే కేసులో ఎంపీ రవిచంద్ర కూడా సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. 3 రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో ఫేక్‌ సీబీఐ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు అధికారులు. అతడి ఫోన్‌లో మంత్రి గంగులతోపాటు ఎంపీ రవిచంద్రతో దిగిన ఫోటోలు ఉన్నాయి. దీంతో అతడికి, ఈ ఇద్దరికీ ఉన్న లింకేంటి? శ్రీనివాస్‌ ఎలా పరిచయం అనే అంశాలపై క్లారిటీ తీసుకునేందుకు ఈ ఇద్దరినీ ఢిల్లీకి పిలిచింది సీబీఐ.

వారం క్రితం హైదరాబాద్‌లో మున్నూరు కాపు సంఘానికి చెందిన మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి శ్రీనివాస్ కూడా వచ్చారు. సీబీఐ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. పలువురితో ఫోటోలు దిగాడు. వీఐపీ లను టార్గెట్ చేస్తూ వారితో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే తమతో కూడా ఫోటోలు దిగారన్నది మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర వర్షన్. అటూ హైదరాబాద్‌లోని ఎంపీ రవిచంద్ర నివాసంలో ఆయనతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ ఢిల్లీ వెళ్లారు.

ఈ మధ్యే మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర ఇళ్లపై ఈడీ రైడ్స్ జరిగాయి. గ్రానైట్‌ కంపెనీళ్లో అవకతవకలకు సంబంధించి దాడులు నిర్వహించారు. ఆ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. కక్షసాధింపుతోనే కేంద్రం ఈ దాడులు నిర్వహించిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఇప్పుడు ఆ ఇద్దరే సీబీఐ ఆఫీస్‌కు వెళ్తుండటం ఆసక్తిని రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..