AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: తెలంగాణలో పాదయాత్రను కట్టడి చేయాలని లా అండ్‌ ఆర్డర్‌ సృష్టించారు: వైఎస్‌ షర్మిల

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. నిన్న వరంగల్‌లో ఆమె పాదయాత్రను..

YS Sharmila: తెలంగాణలో పాదయాత్రను కట్టడి చేయాలని లా అండ్‌ ఆర్డర్‌ సృష్టించారు: వైఎస్‌ షర్మిల
Ys Sharmila1
Subhash Goud
|

Updated on: Nov 30, 2022 | 9:48 PM

Share

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. నిన్న వరంగల్‌లో ఆమె పాదయాత్రను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పర్చారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు కల్వకుంట్ల కవితపై కూడా ఆరోపణలు చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఎప్పుడైనా సమస్యలపై స్పందించావా అంటూ ప్రశ్నించారు. తన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులపై గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని తాను గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. మా పాదయాత్రను కట్టడి చేయాలని లా అండ్‌ ఆర్డర్‌ సృష్టించారని అన్నారు.

తాను కేసీఆర్‌, ఆ పార్టీ నాయకుల గురించి వ్యక్తిగత కామెంట్లు చేయలేదని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రజల సొమ్మును దండుకుని అవినీతికి పాల్పడుతున్నారని డిమాండ్‌ చేశారు. అయితే షర్మిల ఆస్తులపై విచారణ జరిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని, అలాగే మీ ఆస్తులపై కూడా విచారణ చేపట్టేందుకు కేసీఆర్‌ ప్రభుత్వంకు దమ్ముందా అంటూ సవాల్‌ విసిరారు. అవినీతి చేయలేదని గొప్పలు చెప్పుకొంటున్న నేతలందరిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీనని వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజా సమస్యలను ఏ పార్టీ కూడా పోరాడటం లేదని, ఇతర పార్టీల వారు తమతమ వాటాలు తీసుకుని సైలెంట్‌గా ఉండిపోతున్నారని ఆరోపించారు. తాము ప్రజా సమస్యలపై పోరాడటంలో ముందున్నామన్నారు. ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేని నేతలు తన గురించి మాట్లాడుతారా..? అంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం అవినీతికి పాల్పడేది టీఆర్‌ఎస్‌ నేతలని, ఒక్కరు కూడా ప్రజా సమస్యలపై పోరాడింది లేదని అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించలేని నేతలకు తనపై మాట్లాడే హక్కు ఎక్కడుందంటూ ప్రశ్నించారు. తపై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..