YS Sharmila: వారి ఆస్తులపై విచారణ జరిపించాలి.. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల డిమాండ్..

ఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని టీవీ9 బిగ్‌ డిబేట్‌లో డిమాండ్‌ చేశారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. అలాగే తన ఆస్తులపైనే ఎంక్వైరీకి సిద్ధమంటూ సవాల్ విసిరారు.

YS Sharmila: వారి ఆస్తులపై విచారణ జరిపించాలి.. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల డిమాండ్..
Ys Sharmila
Follow us

|

Updated on: Nov 30, 2022 | 9:13 PM

Big News Big Debate -YS Sharmila: వైఎస్ షర్మిల.. అరెస్టు తెలంగాణ వ్యాప్తంగా కాకరేపుతోంది.. ఈ సెగలు అన్ని పార్టీలకు తాకుతున్నాయి. దీంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదలైన రాజకీయ యుద్ధం క్రమంగా భాగ్యనగరానికి వ్యాపించి అల్లకల్లోలంగా మార్చింది. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన YSRTP అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్‌ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ రాజ్‌భవన్‌కు కూడా చేరుకోనుంది. వైఎస్ షర్మిల గురువారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ను కలవనున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు టీవీ9 బిగ్ న్యూస్, బిగ్ డిబేట్ లో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని టీవీ9 బిగ్‌ డిబేట్‌లో డిమాండ్‌ చేశారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. అలాగే తన ఆస్తులపైనే ఎంక్వైరీకి సిద్ధమంటూ సవాల్ విసిరారు. అవినీతి చేయకుంటే అందరిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రజల అభిప్రాయాలనే వ్యక్తపరుస్తున్నానంటూ తెలిపారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులు ఎవరూ లేరని షర్మిల తెలిపారు.

రాయలసీమకు చెందిన మహిళ.. తెలంగాణలో రాజకీయాలు చేయడంపై పలువురు ప్రశ్నిస్తున్నారని దీనికి ఏం సమాధానం చెబుతారంటూ రజినీకాంత్ ప్రశ్నించగా.. షర్మిల టీఆర్ఎస్ మాత్రమే అలా పేర్కొంటోంది అంటూ తెలిపారు. తెలంగాణ ప్రజలకు అంతా తెలుసని తాను పెరిగింది ఇక్కడే.. పెళ్లి చేసుకుంది ఇక్కడేనంటూ తెలిపారు. భవిష్యత్తు కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు.

ప్రతీరోజూ ప్రజల కోసం పోరాడుతున్నామని.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ అవినీతిని ఎత్తిచూపుతున్నది వైఎస్ఆర్‌టీపీ మాత్రమేనని తెలిపారు. మిగతా పార్టీలు ఏవీ మాట్లాడటం లేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వాటా తీసుకుని మాట్లాడటం లేదని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..